Karnataka: గ్రామీణ ప్రాంతాల్లో పశువులను ఇంట్లోనే పేంచుకోవడం సాధారణమే. అయితే, ఒక్కో సారి వాటి నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోనూ ఇలాగే.. ఓ ఆవు బంగారు గొలుసును మింగేసింది. ఇక దానిని బయటకు తీయడంతో ఆ కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడ్డారు.
Karnataka: పెంపుడు జంతువులను చాలా మంది పెంచుకుంటారు. కొందరు కుక్కలను, పిల్లులను, మరి కొందరు ఆవులను కూడా పెంచుకుంటారు. అయితే, వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే ఒక్కొసారి మనం ఊహించని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఇదే నేపథ్యంలో ఓ కుటుంబం కాస్త ఏమరుపాటులో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు ఓ బంగారు గొలుసు మింగేసింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు.. ఆ బంగారు గొలుసును బయటకు తీయడానికి పడరాని పాట్లు పడ్డారు. ఈ ఘటన కర్నాటక లోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. ఆ తర్వాత ఏం జగిందంటే?
ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీ తాలూకాలోని హీపనహళ్లిలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే తన ఇంట్లో ఒక ఆవును పెంచుకుంటున్నాడు. దానికి ఒక దూడ కూడా ఉంది. అయితే, దేశంలో ఆవులను పవిత్రంగా భావించడం, వాటిని పూజించడం చాలా ఏండ్ల నుంచి వస్తున్న ఆచారం. ఈ నేపథ్యంలోనే దీపావళి ముందురోజు గోవు పూజ కార్యక్రమం నిర్వహించాలని ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకుననారు. అనుకున్నదే తడవుగా కుటుంబ సమేతంగా ఆవు, దూడకు స్నానం చేయించి పూజలు చేశారు. దేశంలో ఆవును ఆ సమయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవులను పూల దండలతో అలంకరించడం, రంగురంగు రిబ్బన్లలతో అలంకరిస్తారు. అయితే, శ్రీకాంత్ హెగ్దే కుటుంబం సభ్యులు మాత్రం పూల దండలతో పాటు 20 గ్రాముల బంగారు గొలుసుతో కూడా దూడకి అలంకరించారు. వాటికి పూజ చేసిన అనంతరం పూల దండలతో పాటు గొలుసును తీసి పక్కన ఉంచారు.
Also Read: black magic: కండ్లల్లో నిమ్మరసం కొడుతూ క్షుద్రపూజలు.. బయటపడ్డ మరో దొంగ స్వామీజీ బాగోతం
అయితే, ఆవుకు అలంకరించిన పూలు , ఆ బంగారు గొలుసు కొద్ది సేపట్లోనే కనిపించకుండా పోయాయి. వాటిలో బంగారు గొలుసు వుండటంతో కుటుంబీకులు అందరూ ఆ గొలుసు కోసం గోశాల మొత్తం వెతికారు. కానీ బంగారు గొలుసు కనిపించలేదు. చివరికి ఆ ఆవు గొలుసు మింగేసి ఉంటుందని కుటుంబసభ్యులకు భావించారు. కాస్త ఊపిరి పీల్చుకుని ఆవు పేడ వేసినప్పుడు దానితో పాటు బంగారు గొలుసు కూడా వస్తుందని అనుకున్నారు. కానీ.. ఆవు పేడ వేస్తుంది.. కానీ గొలుసు బయటకు రాలేదు. ఇలా నెల రోజులకు పైనే గడిచింది. ఆవు పేడ వేసిన ప్రతిసారి అందులో వెతకటం కుటుంబ సభ్యుల వంతైంది. పేడతో బంగారు గోలుసు రాకపోవడంతో వారు ఆవును తీసుకుని వేటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. దానికి పలు పరీక్షలు చేసిన పశువైద్యులు గోలుసు దాని కడుపులోనే ఉందని నిర్ధారించారు.
Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఎలాంటి లేఖ రాయలేదు !
వెటర్నరీ డాక్టర్లు ఆ ఆవుకు సర్జరీ చేసి.. ఆ బంగారు గొలుసును బయటకు తీశారు. అయితే, మొత్తం గొలుసు బరువు 20 గ్రాముంలు ఉండేది. కానీ ఆవు నుంచి బయటకు తీసిన తర్వాత దాని బరువు 18 గ్రాములకు చేరింది. దానికి గోలుసులోని చిన్నభాగం మిస్ కావడమే దీనికి కారణం అని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆవు ఆరోగ్యం బాగానే ఉందని శ్రీకాంత్ హెగ్దే కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఎలాంటి లేఖ రాయలేదు !