కనికరం లేకుండా దాడి చేస్తుంటే తిరగబడిన ఆవు.. మాములుగా కుమ్మలేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..

By Sumanth Kanukula  |  First Published Oct 16, 2022, 9:32 AM IST

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్టు చేయబడుతుంటాయి. అయితే అందులో  కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్టు చేయబడుతుంటాయి. అయితే అందులో  కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తిపై ఆవు దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ముందుగా ఆ వ్యక్తి ఆవును హింసించడంతో.. తిరగబడిన ఆవు అతడిని కుమ్మేసింది. @gharkekalesh అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75,000 కంటే ఎక్కువ వ్యూస్, 3,400 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. 

అసలు వీడియోలో ఏముందంటే.. పగ్గంతో కట్టి ఉన్న ఆవును కొందరు వ్యక్తులు ముందుకు లాగుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఆవు వెనకాల ఉన్న ఓ వ్యక్తి.. ఆవును కనికరం లేకుండా తన్నడం, ఆవు తోకను లాగడం, పదేపదే హింసించే విధంగా ప్రవర్తించడం కనిపించింది. అయితే తొలుత ఆవు చాలా ఓర్పుగా ఉండిపోయింది. అయితే కొద్దిసేపటికి ఆ వ్యక్తి నుంచి హింస ఎక్కువ కావడంతో.. ఆవు తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఆవు.. అతడిపై దాడి చేసింది. ముందున్నవారి నుంచి బలంగా పగ్గాన్ని విడిపిచుకుని.. అతడిని కుమ్మేసింది. అతడిని నేలపై పడవేసి తన కొమ్ముతో దాడి చేసింది. కిందపడేసి తొక్కేసింది. దీంతో అక్కడున్నవారంతా భయంతో అరవడం కనిపించింది. 

Latest Videos

 

Kalesh With Animal (Cow-Gang Assemble 💪) pic.twitter.com/JaOHU7WjRo

— r/Ghar Ke Kalesh (@gharkekalesh)


అయితే ఈ వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు కూడా.. ఆ వ్యక్తిదే తప్పని కామెంట్స్ చేస్తున్నారు. జంతువు పట్ల కనికరం లేకుండా వ్యవహరించడం మనిషి తప్పు అని పేర్కొంటున్నారు. ‘‘బాగా జరిగింది.. ఈ దాడికి అతడు అర్హుడు..  మీరు భగవంతుని అటువంటి అందమైన జీవులను గౌరవించలేకపోతే.. జీవులు కూడా మిమ్మల్ని గౌరవించవు’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. 

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని మాత్రం.. పోస్టు చేసిన యూజర్ వెల్లడించలేదు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ఏమిటనేది కూడా తెలియాల్సి ఉంది. 

click me!