కర్ణాటకలోఘోర రోడ్డు ప్రమాదం:9 మంది మృతి,10మందికి గాయాలు

By narsimha lodeFirst Published Oct 16, 2022, 9:24 AM IST
Highlights


కర్ణాటక  రాష్ట్రంలోని అర్సికెరె తాలుకాలో జరిగిన రోడ్డుప్రమాదంలో 9 మంది మరణించారు.మరో 10మంది గాయపడ్డారు.పాలట్యాంకర్,కర్ణాటక ఆర్టీసీ బస్సు,టెంపోట్రాక్స్  ఢీకొనడంతో 9మంది ప్రయాణీకులు మరణించారు.

కర్ణాటక రాష్ట్రంలోని  అర్సికెరె తాలుకాలో శనివారంనాడు రాత్రి జరిగినరోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు.మరో10 మంది గాయపడ్డారు.కేఎంఎఫ్ మిల్క్  ట్యాంకర్,కర్ణాటక  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ,టెంపో ట్రాక్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదంచోటుచేసుకుంది. పాల  ట్యాంకర్,బస్సు మధ్యటెంపో ట్రాక్స్ లో ప్రయాణీస్తున్న ప్రయాణీకులు చిక్కుకుని మరణించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టెంపోట్రాక్స్ లోప్రయానీస్తున్నవారంతా  ధర్మస్థల హాసనాంబ ఆలయాలను సందర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం   చోటు చేసుకుంది.

దేశంలోని  పలు  రాష్ట్రాల్లో   రోజుకు  అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు  ప్రమాదాలకు  డ్రైవర్ల నిర్లక్ష్యం  కూడ కారణంగా  చెబుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 14న  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పై ఈ ప్రమాదం  జరిగింది. 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లుతున్న బీఎండబ్ల్యూ కారు,  కంటైనర్‌లు ఢీకొన్నాయి. హాలియాపూర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో కారులోని నలుగురు స్పాట్‌లోనే మరణించారు.  మరణించిన నలుగురిలో ఒకరి తల తెగిపోయినట్టు స్థానికులు  తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కారు వేగం సుమారు గంటకు 150 కిలోమీటర్లు ఉన్నదని చెబుతున్నారు. కంటైనర్ కూడా అతి వేగంగానే ఉన్నట్టు వివరిస్తున్నారు. సుల్తాన్ పూర్ వైపు నుంచి వస్తున్న బీఎండబ్ల్యూ కారు, లక్నో వైపు నుంచి కంటైనర్ లు వస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

click me!