యూపీలో ఆర్గానిక్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గోవు.. వీడియో వైరల్

Published : Apr 20, 2023, 02:06 AM IST
యూపీలో ఆర్గానిక్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గోవు.. వీడియో వైరల్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అక్కడ ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి గోవును ముఖ్య అతిథిగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

లక్నో: సాధారణంగా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, ఇతర వాణిజ్య సముదాయాలను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, స్థానికంగా పలుకుబడిన కలిగిన వారిని పిలుస్తారు. వారి చేత వాటిని ఓపెనింగ్ చేయిస్తుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మాత్రం ఓ ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా గోవును తీసుకెళ్లారు. ఆ ఆర్గానిక్ రెస్టారెంట్‌ను గోవుతో ఓపెనింగ్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో తొలి ఆర్గానిక్ రెస్టారెంట్‌ను మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ నడపాలని అనుకున్నారు. సుశాంత్ గోల్ఫ్ సిటీలో లులూ మాల్ పక్కనే శైలేంద్ర సింగ్ తన ఆర్గానికి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌ను ఓ గోవుతో ప్రారంభించాలనే ఆలోచన చేశారు. అనుకున్నట్టే ఓ గోవును రెస్టారెంట్‌కు తీసుకువచ్చారు.

Also Read: నెల గడిచినా.. అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ లభించలేదు.. ఇప్పటికీ పరారీలోనే

ఆ గోవును పసుపు వర్ణం గుడ్డతో కప్పారు. దానికి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆ గోవును రెస్టారెంట్‌లోకి తీసుకెళ్లారు. ఆ ఆర్గానిక్ రెస్టారెంట్ పేరు ఆర్గానిక్ ఒయాసిస్. ఆర్గానిక్ సాగుతో పండించిన పంటతో ఇక్కడ ఆహారం ప్రిపేర్ చేస్తారు. ఈ రెస్టారెంట్‌ను గోవుతో ప్రారంభింపజేశారు.

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu