కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. చేయాల్సినవీ, చేయకూడనివి ఇవే..

By telugu news teamFirst Published Jan 15, 2021, 9:02 AM IST
Highlights

శనివారం 3000 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించనున్నారు. తొలిరోజున ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు వీకే పాల్ తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభించి.. మన దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. కాగా.. ఈ మహమ్మారి విరుగుడు కోసం ఎదురుచూడని వారంటూ ఎవరూ లేరు. దీంతో.. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు  చూశారు. 

ఎప్పుడెప్పుడా అని యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రస్థాయిలో గురైన భారత్ లో ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా అమలయ్యే కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోదీ షురూ చేస్తారని నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. తొలిరోజు 3 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు అందిస్తారని వివరించారు.

శనివారం 3000 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించనున్నారు. తొలిరోజున ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు వీకే పాల్ తెలిపారు.

తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లకు, ఇతర ముందు వరుస యోధులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తర్వాత దశలో 50 ఏళ్లకు పైబడిన 270 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందిస్తారు. కరోనా బారిన పడేందుకు అత్యధిక అవకాశాలు ఉన్న 300 మిలియన్ల మందికి రాబోయే కొన్నినెలల్లో టీకా వేయనున్నారు. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా డోసులు పెద్ద సంఖ్యలో పంపిణీ కేంద్రాలకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.

2.మొదటి డోస్ కి.. రెండో డోస్ కి కనీసం 14 రోజుల గ్యాప్ తప్పనిసరి

3.మొదటి డోస్ ఏ కంపెనీది తీసుకున్నామో.. సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలి.

4.రెండు రకాల వ్యాక్సిన్స్ తీసుకోవడం మంచిది కాదు.

కొందరికి మెడిసిన్ తీసుకుంటే.. ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటివారు కూడా వ్యాక్సిన్ కి దూరంగా ఉండటం మంచిది. అంతేకాకుండా.. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ కి దూరంగా ఉండాలి. ఇప్పటి వరకు చేసిన క్లినికల్ ట్రయల్స్ లో గర్భిణీ, పిల్లల తల్లులు పాల్గొనలేదు. కాబట్టి.. ఇది వారికి సురక్షితం కాకపోవచ్చు.


 

click me!