కరోనాకు జీవించే హక్కు ఉంది.. మాజీ సీఎం

By telugu news teamFirst Published May 14, 2021, 7:33 AM IST
Highlights

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి.


దేశంలో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. లక్షల మంది ఈ కరోనా బారినపడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో... ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి.

కరోనా కూడా మనుషుల్లాంటి జీవేనని.. అది కూడా మనలాగే జీవించాలనుకుంటోందని చెప్పారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తోందన్నారు. మనలాగే కరోనా వైరస్ కు సైతం జీవించే హక్కు ఉందని వ్యాఖ్యనించారు. కరోనాతో మీరు, మేము అందరం కలిసి జీవించాల్సిందేనన్నారు. దీంతో... సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మరి విమర్శలకు ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

 

click me!