మార్చిలో 12-14 ఏళ్ల మధ్య పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ - ఎన్‌టీఏజీ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా

By team teluguFirst Published Jan 17, 2022, 2:15 PM IST
Highlights

ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో 12-14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించనున్నట్టు ఎన్‌టీఏజీ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో టీనేజర్లకు రెండో డోసు ఇవ్వడం ప్రారంభమవుతుందని చెప్పారు. 

దేశంలో క‌రోనా (corona) కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా క‌ట్ట‌డి కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతంగా అమ‌లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న టీనేజ‌ర్ల‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించాయి. జ‌న‌వ‌రి 10వ తేదీ నుంచి కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ (covid front line wariars),ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు, 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు ప్రికాష‌న‌రీ డోసు (precautionary dose) అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేషన్ విష‌యంలో మ‌రో ముంద‌డుగు వేయ‌నుంది. 

వ్యాక్సినేష‌న్ (vaccination) ప‌రిధిలోకి ఎక్కువ మందిని తీసుకొచ్చి కోవిడ్ -19 (covid -19) నుంచి ర‌క్షించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో 12-14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ అందించాల‌ని చూస్తోంది. అయితే అది ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మవుతుంద‌నే విష‌యంలో ఇండియా కోవిడ్ -19 వ‌ర్కింగ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) ) చైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా (nk arora) క్లారిటీ ఇచ్చారు. 12-14 ఏళ్ల మధ్య పిల్ల‌ల‌కు ఫిబ్ర‌వ‌రి చివ‌రి లేదా మార్చి మొద‌టి వారంలో వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభ‌మవుతుంద‌ని చెప్పారు. జనవరి చివరి నాటికి 15-18 ఏళ్ల వయస్సు పిల్ల‌ల‌కు మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ పూర్తి చేయ‌డం ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. దీంతో పాటు ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలోనే అర్హులైన టీనేజ‌ర్ల‌కు రెండో డోసు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోందని తెలిపారు. 

ఈ నెల 3వ తేదీన టీనేజ‌ర్ల‌కు (teenagers) కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇవ్వ‌డం ప్రారంభించారు. ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ లో టీనేజ‌ర్లు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన మొద‌టి రోజే దేశ వ్యాప్తంగా 42,06,433 మంది పిల్లలకు టీకాలు అందించారు. అయితే వారిలో చాలా మందికి ఫిబ్ర‌వ‌రి మొదటి వారంలో రెండో డోసు పొందేందుకు అర్హలవుతారు. టీనేజ‌ర్ల‌కు మొద‌టి, రెండో డోసుకు మ‌ధ్య వ్య‌వ‌ధి 28 రోజులుగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

ఇదిలా ఉండగా ఇండియాలో కోవిడ్ -19 వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన నిన్న‌టితో (జ‌న‌వ‌రి 16,2022) నాటికి ఏడాది పూర్త‌య్యింది. వ్యాక్సినేష‌న్ డ్రైవ్ (vacciantion drive) తో సంబంధం ఉన్న అందరినీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prime minister narendra modi) అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములైన డాక్ట‌ర్లు, నర్సులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌శంసించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వ్యాక్సినేష‌న్ గొప్ప బ‌లాన్ని ఇచ్చింద‌ని తెలిపారు.  ఇండియాలో కోవిడ్ -19 వ్యాక్సినేష‌న్ మొద‌టి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా (central health minister mansuk mandaviya) COVID-19 వ్యాక్సిన్‌పై స్మారక పోస్టల్ స్టాంప్‌ను (postal stamp)  విడుదల చేశారు.

భార‌త్ లోని 70 శాతం మందికి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు డోసుల వ్యాక్సిన్ అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి ప్ర‌క‌టించారు. అలాగే 93 శాతం మంది మొద‌టి డోసు వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం జనవరి 16, 2021న కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదటి దశను ప్రారంభించింది. మార్చి 1వ తేదీన రెండో ద‌శ ప్రారంభ‌మైంది. ఇందులో 45 ఏళ్లు పైబ‌డిన వారికి, ఇత‌ర ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి టీకాలు వేశారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సిన్ వేయ‌డం ప్రారంభించారు. 

click me!