
పూణె : ప్రేమించి, Inter-caste marriage చేసుకున్నందుకుగానూ వారిని కొన్నేళ్ల పాటు సామాజికంగా బహిష్కరించారు కులపెద్దలు. ఆ
Deportationకు గురైంది ఒకరిద్దరు కాదు ఏకంగా 13 జంటలు. బాధితుల్లో ఒకరు ఈ వెలివేతమీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కులపెద్దల పంచాయతీ భాగోతం వెలుగు చూసింది. దీంతో కులపెద్దలు ఆరుగురిమీద పోలీసులు Case registration చేశారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన నాందివాలే Communityకి చెందిన జాట్లు కొంతమంది love చేసి, కులాంత వివాహాలు చేసుకున్నారు. అయితే వీరికి కుల పంచాయతీ పెట్టిన కుల పెద్దలు వీరిన ఊరునుంచి బహిష్కరించారు. ఇది జరిగి కొన్నేళ్లు గడిచాక వీరిని తమ కులుంలో చేర్చుకునే విషయం మీద ఈ నెల 9న పలాస్ లో సమావేశం నిర్వహించారు.
కులం నుంచి బహిష్కరించిన వారిని తిరిగి తమ కులంలో కలుపుకునేందుకు అనుమతించాలని సమావేశంలో కొందరు ప్రతిపాదించారు. దీనికి చాలామంది కులపెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీంతో సమావేశంలో కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై సామాజిక బహిష్కరణ మరింత కాలం అమలు చేయాలని తీర్మానించారు.
అంతకుమందు ఇటువంటి తరహా సమావేశాన్ని గతేడాది డిసెంబర్ లో సతారా జిల్లా కరద్ లో నిర్వహించగా.. 2007లో కుల బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ప్రకాష్ భోసాలే (42) ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడా సామాజిక బహిష్కరణ ఎత్తివేయాలన్న ప్రతిపాదనను కొంతమంది తీసుకురాగా కుల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ సమావేశం నుంచి ప్రకాశ్ భోసాలే వెనుదిరిగి వచ్చేశారు.
ఆ తరువాత స్థానికంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిని కలిసి తమ సమస్యను వివరించారు. ఆ సమితి వారి సహాయంతో ప్రకాశ్ భోసాలే నేరుగా పలాస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం మీద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనలా సామాజిక బహిష్కరణకు గురైన వారు 13జంటలు ఉన్నాయని పేర్కొనడంతో పోలీసులు ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకాశ్ భోసాలే ఫిర్యాదు మేరకు ఆరుగురు జాట్లపై కేసు నమోదు చేసినట్లు పలాస్ ఎస్సై వికాస్ జాధవ్ తెలిపారు.
ఇలాంటి ఘటనే నిరుడు డిసెంబర్ లో పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి లో జరిగింది. ఆ గ్రామానికి చెందిన సమ్మయ్య, మల్లయ్య, రాజయ్యలు ముగ్గరు అన్నదమ్మలు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వద్ద 6 గుంటల భూమిని గతంలో కొనుగోలు చేశారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పేపర్ మీద రాయించుకున్నారు. అయితే కొంత కాలం తరువాత ఆ స్థలం కుల సంఘం ఉపయోగించుకోవడానికి కావాలని కుల సంఘ పెద్దలు కోరారు. దీనికి ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఒప్పుకున్నారు.
2008 సంవత్సరంలో అబ్దుల్ అలీ పేరుతో ఉన్న భూమిని కుల సంఘంతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇటీవల అతను మృతి చెందాడు. దీంతో ఆ స్థలాన్ని కొలతలు వేయించగా.. కొంత భూమి తక్కువగా వచ్చింది. దీనికి ఆ ముగ్గురు అన్నదమ్ములే కారణమని, అప్పుడే భూమికి కొలతలు వేయిస్తే సమస్య ఉండకపోయేదని అన్నారు. ఆ భూమి మొత్తం ఇప్పించే బాధ్యత మీదే అని ఆ అన్నదమ్ములను ఆదేశించారు. ఇందలో తమ తప్పేమి లేదని, భూమిని కొనుగోలు చేసి అందులో ఎటువంటి మార్పులు చేయకుండా అమ్మేశామని తెలిపారు.
భూ సమస్యకు పరిష్కారం చూపే వరకు కుల నుంచి బహిష్కరిస్తున్నామని ఆ కుల సంఘం పెద్దలు తీర్మాణించారు. వారికి సాయం చేసిన వారికి, మాట్లాడిన వారికి రూ.50 వేల ఫైన్ వేస్తామని కులస్తులను హెచ్చరించారు. దీంతో ఎవరూ ఆ ముగ్గురు అన్నదమ్ములతో మాట్లాడటం లేదు. ఈ క్రమంలో సమయ్య, మల్లయ్య, రాజయ్యలకు వరుసకు చినతల్లి అయ్యే మల్లమ్మ మృతి చెందింది. ఆమెను కడసారి చూసేందుకు కూడా కుల సంఘం పెద్దలు ఒప్పుకోలేదు.