కరోనా భయంతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి

Published : Jan 09, 2022, 01:44 PM IST
కరోనా భయంతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి

సారాంశం

 కరోనా భయంతో తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   

మధురై:corona భయంతో Tamilnaduరాష్ట్రంలో ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్యాయత్నం చేసుకొం ది. వీరిలో ఇద్దరు మరణించగా, మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

Madurai సమీపంలోని కల్మెడులో ఆదివారం నాడు తెల్లవారుజామున ఓ మహిళ, ఆమె మేనల్లుడు  సహా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో  అస్వస్థతకు గురైన మరో ఇద్దరు మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 పోలీసుల కథనం ప్రకారంగా  కల్మెడులోని ఎంజీఆర్ కాలనీకి చెందిన Jothika, ఆమె మేనల్లుడు Ritishమృతి చెందారు. జ్యోతిక తల్లి లక్ష్మి, ఆమె సోదరుడు సిబిరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది క్రితం   లక్ష్మి  భర్త, ఆమె మరో కూతురు కూడా మరణించారు.  జ్యోతికికకు ఒక్క రోజు క్రితం కరోనా సోకింది. దీంతో ఆర్ధికంగా చితికి పోతామనే భయంతో ఈ కుటుంబమంతా పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పారు. 

నలుగురు కుటుంబ సభ్యులు విషం తీసుకొని శనివారం  నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఉదయం జ్యోతిక, రితిష్ లు అక్కడికక్కడే మరణించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !