అసెంబ్లీ ఎన్నికల వేళ.. యూపీ బీజేపీలో కరోనా కలకలం...రాధామోహన్ సింగ్ కు పాజిటివ్..

Published : Jan 11, 2022, 01:33 PM IST
అసెంబ్లీ ఎన్నికల వేళ.. యూపీ బీజేపీలో కరోనా కలకలం...రాధామోహన్ సింగ్ కు పాజిటివ్..

సారాంశం

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, యూపీ ఇంచార్జ్ రాధామోహన్ సింగ్ కు మంగళవారం ఉదయం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో నిన్న రాత్రి అక్కడి పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. 

లక్నో : ఉత్తరప్రదేశ్ BJPలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి Radha Mohan Singhకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హాజరైన సమావేశంలో పార్టీ పెద్దలంతా పాల్గొన్నారు.  వారిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్  స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఉన్నారు.  

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, యూపీ ఇంచార్జ్ రాధామోహన్ సింగ్ కు మంగళవారం ఉదయం Corona positivityవ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. Assembly electionsకు సిద్ధమవుతున్న తరుణంలో నిన్న రాత్రి అక్కడి పార్టీ నేతలంతా సమావేశమయ్యారు. 

రాధా మోహన్ సింగ్, స్వతంత్ర దేవ్ సింగ్, ఆ పక్కనే ఆదిత్యనాథ్ కూర్చుని కార్యాచరణపై చర్చించారు,  రాధా మోహన్ సింగ్ షేర్ చేసిన ఫోటోలను బట్టి ఆ విషయం  వెల్లడవుతోంది.  ఇదిలా ఉండగా..  ఈరోజు స్వతంత్ర దేవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుండడం గమనార్హం.  

మరోపక్క ఈ ఎన్నికల కోసమే యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తదితరులు బిజెపి కోర్కమిటీ సమావేశం కోసం  ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

 నిన్న సాయంత్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అధిక ప్రమాదంలో ఉంటే తప్ప,  kovit పాజిటివ్గా తేలిన వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి Narendra Modi ఈ నెల 13న  రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. దేశంలో Corona  కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై Chief Ministersతో ప్రధాని చర్చించనున్నారు. దేశంలో కరోనా Omicron కేసులు ఐదు వేలకు చేరువలో ఉన్నాయి.

India లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. అయితే తాజాగా నమోదైన కేసులు కిందటి రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే 6.5 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతిచెందారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,84,213కి చేరింది. తాజాగా కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాటిజివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470, పశ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, తమిళనాడులో 13,990, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశంలో నిన్న 15,79,928 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా Icmr తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తంగా 69,31,55,280 శాంపిల్స్‌కు పరీక్షించినట్టుగా పేర్కొంది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో నిన్న 92,07,700 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?