రెండోసారి పవార్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ: బిజెపిపై ఫైట్, రేపు ప్రతిపక్షాల సమావేశం

Published : Jun 21, 2021, 05:08 PM ISTUpdated : Jun 21, 2021, 05:12 PM IST
రెండోసారి పవార్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ: బిజెపిపై ఫైట్, రేపు ప్రతిపక్షాల సమావేశం

సారాంశం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండోసారి ఎన్సీపీ చీప్ శరద్ పవార్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రేపు ప్రతిపక్షాల నేతల భేటీకి ఆహ్వానాలు వెళ్లాయి. బిజెపిని ఎదుర్కునే విషయంపై ఈ సమావేసంలో చర్చ జరుగుతుందని అంటున్నారు.

న్యూఢిల్లీ: వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం, ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండోసారి ఎన్సీపీ నేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. 2024 లోకసభ ఎన్నికల్లోనే కాకుండా, వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనూ బిజెపిని ఎదుర్కునేందుకు వ్యూహరచన సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల భేటీకి శరద్ పవార్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల నేతలకు శరద్ పవార్ తో పాటు ఇటీవల తృణమూల్ కాంగ్రెసులో చేరిన బిజెపి మాజీ నేత యశ్వంత్ సిన్హా సంయుక్తంగా ప్రతిపక్షాల నేతలకు ఆహ్వానాలు పంపించారు. ప్రస్తుత జాతీయ పరిస్థితుల నేపథ్యంలో శరద్ పవార్, యశ్వంత్ సిన్హా సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారని, ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారని సిన్హాకు చెందిన రాష్ట్ర మోర్చా ఆ ఆహ్వానాలు పంపించింది. 

ఆర్జేడీ నేత మనోజ్ ఝాకు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ కు, కాంగ్రెసు నేత కపిల్ సిబల్ కు ఆహ్వానాలు వెళ్లాయి.  తమకు ఆహ్వానమేదీ రాలేదని తమిళనాడు పాలక పార్టీ డిఎంకె చెబుతోంది. తమకు ఆ సమావేశం గురించి తెలియదని అంటోంది. కాంగ్రెసుకు ఆహ్వానం పంపించలేదని సమాచారం. 

శరద్ పవార్ తో ప్రశాంత్ కిశోర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ స్థితిలో ప్రతిపక్షాల బేటీకి సంబంధించిన విష,యం ముందుకు వచ్చింది. మంగళవారంనాటి సమావేశంలో నరేంద్ర మోడీకి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపైనే కాకుండా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసే విషయంపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్షాల నేతల బేటీ జరుగుతుంది. దాదాపు 15 పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. నరేంద్ర మోడీపై అసంతృప్తి పెరిగిపోయిందని, ఈ నేపథ్యంలో బిజెపిలోని కొంత మంది నేతలు ప్రతిపక్షాల ఉమ్మడి ప్రయత్నానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..