గుడ్‌న్యూస్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి

By narsimha lodeFirst Published Jan 3, 2021, 11:17 AM IST
Highlights

కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతిస్తూ డీసీజీఐ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది.

కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతిస్తూ డీసీజీఐ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది.ఆదివారం నాడు ఉదయం డీసీజీఐ డైరెక్టర్  సోమానీ మీడియాతో మాట్లాడారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు ఇప్పటికే నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ టీకాలను అత్యవసర వినియోగానికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డీసీజీఐ అనుమతితో ఈ వారంలోనే వ్యాక్సిన్ ను ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందనే సమాచారం.

కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని డీసీజీఐ డైరెక్టర్ సోమాని తెలిపారు.నిపుణుల కమిటీ రెండు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలో క్లినికల్ ట్రయల్స్  కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.  ఈ రెండు వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవవని తేలిందని ఆయన వివరించారు. 

కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అభివృద్ది చేశాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్  కు చెందిన సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్ కమిటీ భారత్ లో అత్యవసర ఉపయోగం కోసం ఈ రెండు టీకాలను సిఫారసు చేసిన తర్వాత డీసీజీఐ ఈ రెండు టీకాలను అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చింది. జనవరి 1వ తేదీన కోవిషీల్డ్ ను అత్యవసర వినియోగం కోసం గుర్తు చేసింది.

click me!