కోవిడ్ 19 : వందరోజుల దిగువకు కేసులు.. కొత్తగా 44,111 మందికి పాజిటివ్, 738 మరణాలు...

By AN TeluguFirst Published Jul 3, 2021, 10:24 AM IST
Highlights

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా 18,76,036 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో మొత్తం కేసులు 3,05,02,362కి చేరాయి. 

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా 18,76,036 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 44,111 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజు కంటే 5 శాతం తగ్గుదల కనిపించింది. దీంతో మొత్తం కేసులు 3,05,02,362కి చేరాయి. 

24 గంటల వ్యవధిలో 738మంద ప్రాణాలు కోల్పోయారు. మరణా సంఖ్య ఏప్రిల్ 8 నాటి కనిష్ఠానికి చేరింది. ఇప్పటివరకు 4,01,050 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్కరోజే 57,477 మంది కోవిడ్ నుంచి కోలుకోగా, క్రియాశీల కేసులు 5 లక్షల దిగువకు చేరాయి, మొత్త రికవరీలు 2.96 కోట్ల మార్కును దాటాయి. 

క్రియాశీల రేటు 1.67 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.01 శాతానిక పెరిగింది. మరోపక్క నిన్న 43,99,298మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 34,46,11,291కి చేరింది. 

శుక్రవారం నాడు  కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్‌లలో పెరుగుతున్న కోవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ రాష్ట్రాల్లో కరోనాను కంట్రోల్ లోకి తేవడానికి ఈ బృందాలు పనిచేస్తాయి. 

ఇద్దరేసి సభ్యుల ఉన్నత స్థాయి బృందంలో ఒక డాక్టర్, ఒక పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్ ఉంటారు.  "బృందాలు వెంటనే రాష్ట్రాలను సందర్శిస్తాయి. COVID-19  నియంత్రణను సంబంధంచిన అంశాలను పర్యవేక్షిస్తాయి. 

ప్రత్యేకించి టెస్టులు, నిఘా, నియంత్రణ కార్యకలాపాలతో పాటు, ఆసుపత్రుల్లో పడకల లభ్యత, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్తో సహా తగినంత లాజిస్టిక్స్ ఉన్నాయా, COVID-19 టీకాలు ఎంతవరకు వేశారు లాంటి అంశాల్లో పనిచేస్తారని" ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.

దేశంలో ఇప్పటివరకు 34 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. గర్భిణీ స్త్రీలకు కోవిడ్ 19 టీకాలు వేయచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది.

click me!