కోరలుచాస్తున్న కరోనా... దేశంలో మొదటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసు

By Arun Kumar PFirst Published Mar 21, 2020, 7:59 PM IST
Highlights

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలో రెండో దశ నుండి మూడో దశకు చేరుకుందన్న ప్రచారం దేశప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. 

కరోనా వైరస్... ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న పేరు. ఈ వైరస్ సోకడం కాదు కేవలం పేరు వింటేనే భయపడే పరిస్థితులు యావత్ ప్రపంచంలో చోటుచేసుకున్నారు. ఒకటి రెండు దేశాలు మినహా అన్ని దేశాలపై ఈ మహమ్మారి పంజా విసురుతోంది. ఈ వైరస్ బారిన భారతదేశం పడినప్పటికి ఇప్పటివరకు ప్రమాదకర స్థాయికి చేరుకోలేదు. కేవలం విదేశీయులు, విదేశాలకు వెళ్లివచ్చిన భారతీయుల్లో మాత్రమే కరోనా వైరస్ భయపడింది. అయితే తాజాగా ఈ వైరస్ వ్యాప్తి మరో రూపాన్ని సంతరించుకున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా మహారాష్ట్రలోని పూణే పట్టణంలో ఓ మహిళకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆమెకు వైరస్ సోకిన విధానం అత్యంత ప్రమాదకర స్థితిని తెలియజేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆమే విదేశీయురాలు కాదు విదేశాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. కాబట్టి ఆమె ఈ వైరస్ బారిన పడటానికి   కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (సమూహాల ద్వారా) కారణమై వుంటుందని అనుమానిస్తున్నారు. 

read more  విజృంభిస్తున్న కరోనాపై పోరాటం... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఇటీవల ఆమె ఓ వివాహానికి హాజరయినట్లు... అక్కడే ఈ వైరస్ బారినపడి వుంటారని సమాచారం. ఈ పెళ్లికి వచ్చిన అతిథుల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తిచెందివుండవచ్చని భావిస్తున్న అధికారులు ఆ వేడుకలో పాల్గొన్నవారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో వెంటిలేటర్ ఉపయోగిస్తున్నారు. 

ఇలా సమూహాల ద్వారా వైరస్ వ్యాప్తిచెందడం అనేది మూడో దశకు చేరుకోవడాన్ని సూచిస్తుంది. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి భారత్ చేరుకుందన్నట్లే అని ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం భారత్ మూడో దశకు చేరుకుందన్న ప్రకటన ప్రభుత్వం నుండి రాలేదు. కాబట్టి ఇలాంటి ఊహాగానాలను ప్రచారం చేసి ప్రజల్లో మరింత భయాన్ని  పెంచొద్దని నిపుణులు సూచిస్తున్నారు. 

 

click me!