
డిపాజిటర్లను మోసం చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే కదిరవన్ భార్యకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మదురైలో కేఎల్ కే ఫైనాన్స్ సంస్థను తిరుచ్చి మనచ్చనల్లూర్ డీఎంకే ఎమ్మెల్యే కదిరవన్ భార్య ఆనందలక్ష్మి నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థలో డిపాజిట్ చేసిన పలువురిని మోసం చేసారనే ఫిర్యాదుల మేరకు ఆర్థికనేర విభాగం డీఎస్పీ అరివళగన్ నేతృత్వంలో విచారణం జరుగుతోంది. డిపాజిట్ దారుల ప్రత్యేక కోర్టులో సాక్ష్యం చెప్పాలని ఎమ్మెల్యే భార్య ఆనందలక్ష్మి, అత్త, బామ్మలకు నోటీసులిచ్చినా వారు విచారణకు హాజరు కాలేదు.
ఆ ముగ్గురికి న్యాయమూర్తి హేమంత్ కుమార్ బుధవారం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇదే కేసులో విచారణకు హాజరుకాని మాజీ న్యాయమూర్తి ద్వారకానాథ్, ఆయన బంధువులు ముగ్గురికి కూడా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.