నాకు వీర్య కణాలు తక్కువ, ఆ బిడ్డ నా బిడ్డకాదు.. కోర్టుకెక్కిన భర్త..!

By telugu news teamFirst Published Sep 16, 2021, 2:42 PM IST
Highlights

బిడ్డ పుట్టింది 2007 లో కాగా  అతను తాజాగా కోర్టును ఆశ్రయించాడు. అయితే..  అతని పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు డీఎన్ఏ టెస్టుకి అనుమతించింది.


తన భార్యకు పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఆ బిడ్డకు డీఎన్ఏ టెస్టు జరిపించాలని.. తన బిడ్డ కాదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా..  బిడ్డ పుట్టింది 2007 లో కాగా  అతను తాజాగా కోర్టును ఆశ్రయించాడు. అయితే..  అతని పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు డీఎన్ఏ టెస్టుకి అనుమతించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  అతను మిలిటరీ ఉద్యోగి.. 2006, మే 5వ తేదీన అతనికి వివాహం జరిగింది.. 2007, మార్చి 9వ తేదీన అతని భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఆ కొడుకు తనకు పుట్టలేదంటూ తాజాగా అతను కోర్టుకెక్కాడు.. డీఎన్‌ఏ టెస్ట్ జరిపించమని అభ్యర్థించాడు.. భార్య నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన అతను.. ఆ ప్రాసెస్ జరుగుతుండగానే ఈ పిటిషన్ కూడా దాఖలు చేశాడు.. అతడి పిటిషన్‌ను విచారించిన కేరళ హై కోర్టు డీఎన్‌ఏ టెస్ట్‌కు అనుమతినిచ్చింది. 

`నేను మిలిటరీలో పనిచేస్తున్నాను. నాకు 2006, మే 5వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే 22 రోజులపాటు నేను డ్యూటీకి వెళ్లిపోయాను. తిరిగి వచ్చిన తర్వాత కూడా నేను నా భార్యతో శారీరకంగా కలవలేదు. అలాగే, నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను తండ్రిని కావడం కష్టమని డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. నా భార్యకు ఆమె అక్క భర్తతో ఎప్పట్నుంచో వివాహేతర సంబంధం ఉంది. అతడి వల్లే నా భార్యకు కొడుకు పుట్టాడ`ని పిటిషనర్ హైకోర్టుకు విన్నవించాడు. 

click me!