ఇద్దరు భార్యలతో కలిసి వ్యక్తి ఆత్మహత్య... పిల్లలను ఇంట్లోనే..

Published : Dec 03, 2019, 02:39 PM IST
ఇద్దరు భార్యలతో కలిసి వ్యక్తి ఆత్మహత్య... పిల్లలను ఇంట్లోనే..

సారాంశం

సంజన ఓ జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేది. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు సూసైడ్ లేఖలో రాసిన దాని ప్రకారం ఈ విషయం బయటపడింది. కాగా... వారి అంత్యక్రియలకు అవసరమైన డబ్బుని కూడా ఆ లేఖ వద్ద ఉంచడం గమనార్హం.  

ఇద్దరు భార్యలతో కలిసి ఓ వ్యక్తి ఎనిమిదో అంతస్థు నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా... పిల్లలను ముందుగానే ఇంట్లోనే హత్య  చేసి...  అనంతరం ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్ కి చెందిన గుల్షాన్ వాసుదేవ్(45) భార్య పర్వీన్, మరో మహిళ సంజన.. ఇద్దరు పిల్లతో కలిసి వైభవ్ కాండ్ ప్రాంతంలోని ఇందిరాపురం అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. కాగా... వాసుదేవి భార్య పర్వీన్ కాగా... మరో మహిళ సంజతో ఐదు సంవత్సరాల క్రితం సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఐదు సంవత్సరాల నుంచి వారితోనే కలిసి ఉంటోంది.

కాగా.., సంజన ఓ జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేది. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు సూసైడ్ లేఖలో రాసిన దాని ప్రకారం ఈ విషయం బయటపడింది. కాగా... వారి అంత్యక్రియలకు అవసరమైన డబ్బుని కూడా ఆ లేఖ వద్ద ఉంచడం గమనార్హం.

ఆ డబ్బుతో తమ కుటుంబసభ్యులందరికీ అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా... చిన్నారుల వయసు కూడా 15ఏళ్లలోపు ఉండటం గమనార్హం. ఈ ఘటనలో వాసుదేవ్, భార్య పర్వీన్, చిన్నారులు ఇద్దరూ చనిపోగా... సంజన మాత్రం గాయాలతో బయటపడింది. ఆమె.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌