లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్.. రూ.లక్ష టోకరా

By telugu news teamFirst Published Mar 30, 2020, 12:11 PM IST
Highlights

ముంబయి నగరానికి చెందిన దంపతులకు లౌక్ డౌన్ కారణంగా మద్యం లభించలేదు. దీంతో.. మార్చి 24వ తేదీన ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారు. ఆ సమయంలో తన బ్యాంక్ వివరాలను సదరు దంపతులు మద్యం దుకాణదారుడికి చెప్పారు. దీంతో.. వారి ఎకౌంట్ నుంచి విడతల వారీగా  దాదాపు రూ.లక్ష డ్రా అయ్యాయి.

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. దీని వల్ల చాలా మంది పనులు దొరకక.. తినడానికి తిండి దొరకక. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే.. ఓ దంపతులు మాత్రం మద్యం దొరకక ఇబ్బంది పడ్డారు. దీంతో.. ఆన్ లైన్  ఆర్డర్ చేశారు. చివరకు.. సైబర్ క్రైమ్ మోసగాళ్ల మాయలో పడి రూ.లక్ష పొగొట్టుకున్నాడు.

Also Read ఆ ఒక్కటీ చేయండి.. కరోనా సోకి కోలుకున్న మహిళ కామెంట్స్...

ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయి నగరానికి చెందిన దంపతులకు లౌక్ డౌన్ కారణంగా మద్యం లభించలేదు. దీంతో.. మార్చి 24వ తేదీన ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారు. ఆ సమయంలో తన బ్యాంక్ వివరాలను సదరు దంపతులు మద్యం దుకాణదారుడికి చెప్పారు. దీంతో.. వారి ఎకౌంట్ నుంచి విడతల వారీగా  దాదాపు రూ.లక్ష డ్రా అయ్యాయి.

దీంతో మోసపోయామని గుర్తించిన దంపతులు మార్చి 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి మద్యం సరఫరా చేస్తామనగానే నమ్మి వారు ఆర్డర్ చేశారు. రూ.3వేలు బిల్లు అయ్యిందని.. ఆన్ లైన్ పేమెంట్ చేయాలని, ఓటీపీ చెప్పాలని అడిగారు. వీళ్లు వెంటనే అడిగిన సమాచారం చెప్పారు. రూ.3వేలకు బదులు తొలుత రూ.30వేలు డ్రా అయ్యాయి. తర్వాత విడతల వారీగా మొత్తం రూ.లక్ష ఎకౌంట్ నుంచి  మాయమయ్యాయి.

కనీసం ఆర్డర్ చేసిన మందు కూడా ఇంటికి రాలేదు. దీంతో.. మోసపోయామని గుర్తించారు. సదరు మద్యం సరఫరా చేస్తామన్న సర్వీస్ నెంబర్ కి ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

click me!