అప్పు తీర్చమందని.. వృద్ధురాలి గొంతుకోసి చంపి, ముక్కలు చేసి.. కాలువలోకి విసిరేసిన జంట... !

Published : Jul 14, 2021, 10:17 AM IST
అప్పు తీర్చమందని.. వృద్ధురాలి గొంతుకోసి చంపి, ముక్కలు చేసి.. కాలువలోకి విసిరేసిన జంట... !

సారాంశం

ఆమెను చంపి, కాలువలో పడేసే ముందు శవాన్ని ముక్కలుగా కోశామని పోలీసులకు తెలిపారు. వీరు చెప్పిన దాని ప్రకారం గాలించిన పోలీసులు కాలువ నుంచి మహిళ మృతదేహాన్ని  వెలికి తీశారు.

ఢిల్లీలోని నజఫ్ ఘర్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ వృద్ధ మహిళను హత్య చేయడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని కాలువలోకి విసిరేశారు. ఈ కేసులో ఓ జంటను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. 

వీరు ఆ మహిళ నుంచి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తరువాత దాన్ని చెల్లించలేదు. దీంతో ఆమె ఒత్తిడి తెస్తుండడంతో ఈ దారుణానికి తెగబడ్డారు. నిందితులైన జంట అనిల్ ఆర్య, అతని భార్య తనూ లు తమ నేరాన్ని అంగీకరించారు. 

అంతేకాదు ఆమెను చంపి, కాలువలో పడేసే ముందు శవాన్ని ముక్కలుగా కోశామని పోలీసులకు తెలిపారు. వీరు చెప్పిన దాని ప్రకారం గాలించిన పోలీసులు కాలువ నుంచి మహిళ మృతదేహాన్ని  వెలికి తీశారు.

నిందితుడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆమె దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆమె ఒత్తిడి తెస్తుండడంతో తాను ఈ పని చేసినట్టుగా ఒప్పుకున్నాడు. మృతురాలి ఇంటికి దగ్గర్లోనే నివాసం ఉండే ఈ జంట.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చూసి.. గొంతు కోసి చంపేశారని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌