గొడ్డలితో నరికి విద్యార్థిని దారుణ హత్య..!

Published : Jul 14, 2021, 09:41 AM IST
గొడ్డలితో నరికి విద్యార్థిని దారుణ హత్య..!

సారాంశం

కాగా.. ప్రతిరోజూ వేధిస్తుండటంతో.. తట్టుకోలేకపోయిన బాధిత బాలిక తన తండ్రికి ఫిర్యాదు చేసింది.

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. కాగా నిందితుడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

ఢిల్లీలోని మోటీబాగ్ ఏరియాకు చెందిన ఓ బాలిక 11వ తరగతి చదువుతోంది. కాగా.. ఆమె వెంట కొద్ది నెలలుగా ప్రవీణ్ అనే యువకుడు ప్రేమ పేరిట వెంటపడుతున్నాడు. ప్రవీణ్.. నిరుద్యోగిగా తెలుస్తోంది.కాగా.. ప్రతిరోజూ వేధిస్తుండటంతో.. తట్టుకోలేకపోయిన బాధిత బాలిక తన తండ్రికి ఫిర్యాదు చేసింది.

ఆమె తండ్రి సమీపంలోని ఓ అపార్టమెంట్ కి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో.. ప్రవీణ్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చి.. నాలుగు దెబ్బలు కూడా కొట్టాడు. మరోసారి తన కూతురు జోలికి రావద్దని హెచ్చరించాడు. తనను తండ్రితో కొట్టించిందని ప్రవీణ్ ఆమెపై పగ పెంచుకున్నాడు,

ఈ క్రమంలో.. గొడ్డిలితో..  యువతిని నడి రోడ్డుపై పథకం ప్రకారం నరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిని చూసిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఆమె అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడి కోసం గాలించారు.

కాగా.. నిందితుడు ప్రవీణ్.. తన  సోదరి ఇంట్లో దాక్కోగా.. పోలీసులు  అతనిని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu