వరించిన అదృష్టం.. లాటరీలో రూ.3.3కోట్లు గెలిచిన కపుల్

Published : Feb 11, 2021, 11:07 AM IST
వరించిన అదృష్టం.. లాటరీలో రూ.3.3కోట్లు గెలిచిన కపుల్

సారాంశం

ఈ ఢబ్బుతో ఏం చేస్తారని ప్రశ్నించగా... షాజీ సమాధానమిస్తూ ఇంతపెద్ద మొత్తంతో తమ కుటుంబ పరిస్థితులు మారిపోతాయన్నారు. ఈ మొత్తాన్ని తాను, తన భార్య జాయింట్ ఎకౌంట్‌లో ఉంచుతామని తెలిపారు. 

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా వరిస్తుందో చెప్పలేం. అనుకోకుండా వచ్చి పడుతుంది. అలాంటి అదృష్టమే ఓ జంటకు దక్కింది. లాటరీలో రూ.3.3 కోట్లు గెలుచుకున్నారు. ఆసియాలో అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న లోటోల్యాండ్ తన మొదటి జాక్‌పాట్‌ను ప్రకటించింది. కేరళలో  వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న ఒక జంటకు లోటో‌ల్యాండ్ మొదటి జాక్‌పాట్ దక్కింది. షాజీ మాథ్యూ, అతని భార్య ఈ లాటరీలో రూ. 3.3 కోట్ల రూపాయలు దక్కించుకున్నారు. 

ఒక ఇంటర్వ్యూలో షాజీ మాట్లాడుతూ తాను దీనికి సంబంధించిన ఈ మెయిల్ చూసినపుడు, తరువాత లోటోల్యాండ్ నుంచి ఫోన్ వచ్చినపుడు నమ్మలేకపోయానని తెలిపారు. ఈ ఢబ్బుతో ఏం చేస్తారని ప్రశ్నించగా... షాజీ సమాధానమిస్తూ ఇంతపెద్ద మొత్తంతో తమ కుటుంబ పరిస్థితులు మారిపోతాయన్నారు. ఈ మొత్తాన్ని తాను, తన భార్య జాయింట్ ఎకౌంట్‌లో ఉంచుతామని తెలిపారు. 

తమ పిల్లలకు కాలేజీ ఫండ్ ఏర్పాటు చేస్తామని, ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లోటోల్యాండ్ ప్రతినిధి మాట్లాడుతూ తమ ప్రయాణంలో ఈ పురోగతికి సంతోషిస్తున్నాం. ఇటీవలే మేము తొలి లక్షాధికారిని సెలబ్రేట్ చేశాం. ఇప్పడు షాజీ కుటుంబాన్ని కోటీశ్వరులను చేశామని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌