వివాహేతర సంబంధం: జంటకు బూట్ల దండ వేసి ఊరేగింపు

Published : Sep 27, 2020, 03:59 PM IST
వివాహేతర సంబంధం: జంటకు బూట్ల దండ వేసి ఊరేగింపు

సారాంశం

 వివాహేతర సంబంధం పెట్టుకొన్నారనే నెపంతో ఓ జంట మెడకు బూట్ల దండలు వేసి గ్రామస్తులు ఊరేగించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 


జార్ఖండ్: వివాహేతర సంబంధం పెట్టుకొన్నారనే నెపంతో ఓ జంట మెడకు బూట్ల దండలు వేసి గ్రామస్తులు ఊరేగించారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకొంది.  ఇటీవల కాంలో శివపహాడ్ ప్రాంతంలో తన బంధువులతో కలిసి ఉండడానికి వచ్చింది.

also read:యూపీలో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్

జుహిబోనా ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహితకు పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయం తెలుసుకొన్న గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. వీరికి రూ. 5 లక్షల జరిమానా విధించారు. పంచాయితీ ఆదేశం మేరకు బూట్ల దండ వేసి ఈ జంటను గ్రామంలో తిప్పారు. 

ఈ దృశ్యాలను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.ఈ వీడియోలు పోలీసులకు చేరుకొన్నారు. పోలీసులు వారిని రక్షించారు.
 

PREV
click me!

Recommended Stories

Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !
WhatsApp : ఇక వాట్సాప్ ఫ్రీ కాదు.. నెలకు రూ.79 చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?