
అహ్మదాబాద్ : అహ్మదాబాద్‌లో ఓ డూప్లెక్స్ హౌజ్ లో చెలరేగిన మంటల్లో భార్యభర్తలతో పాటు వారి 8యేళ్ల చిన్నారి మృత్యువాతపడ్డారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో దంపతులు, వారి ఎనిమిదేళ్ల కుమారుడు మృతిచెందినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు మంటలు చెలరేగాయని, ఆ సమయంలో బాధితులు ఇంటి మొదటి అంతస్తులో ఉన్న బెడ్‌రూమ్‌లో ఉన్నారని డివిజనల్ అగ్నిమాపక అధికారి ఓం జడేజా తెలిపారు.
"అగ్నిప్రమాదానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కారణాలు తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది అని తెలిపారు. ఆత్మహత్యకు గల అవకాశాలను కూడా తోసిపుచ్చలేమన్నారు. దీంతోపాటు గదిని వెచ్చగా ఉంచడానికి ఆ కుటుంబం గదిలో మంట వేసి ఉండొచ్చని.. అది ప్రమాదవశాత్తు చెలరేగడంతో చనిపోయి ఉండే అవకాశాలూ ఉన్నాయని.. అగ్ని ప్రమాద కారణానికి అవకాశం ఉన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం..’ అన్నారు.
పెళ్లాం నగలు భర్త తీసుకోవడం చోరీనే.. అనుమతి లేకుండా తీసుకుంటే నేరమే.. ఢిల్లీ హైకోర్టు
"కాల్ అందుకున్న తర్వాత మొదటి రెస్పాన్స్ వాహనం సైట్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది సహాయం కోసం అరుస్తున్నారు. రెస్క్యూ టీమ్ భవనంలోకి ప్రవేశించినప్పుడు, వారు డ్యూప్లెక్స్ మొదటి అంతస్తులో బెడ్‌రూమ్ తలుపు దగ్గర పడి ఉన్న మూడు మృతదేహాలను చూశారు" అని అధికారి తెలిపారు. .
మంటల వల్ల దట్టమైన పొగ అలుముకుని.. అది పీల్చడం వల్ల బాధితులు మరణించి ఉండవచ్చన్నారు. కొన్ని శరీర భాగాలు కూడా కాలిపోయాయని జడేజా తెలిపారు. మృతులను జయేష్ వాఘేలా (40), అతని భార్య హన్సాబెన్ (35), వారి కుమారుడు రోహన్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.మంటలు ఇంట్లోని ఇతర గదులకు వ్యాపించేలోపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని అధికారి తెలిపారు.ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.