మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు: అమిత్ షా కీలక కామెంట్స్

By narsimha lodeFirst Published Oct 18, 2020, 11:50 AM IST
Highlights

మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొంత సంయమనం పాటించే అవకాశం ఉందని తాను నమ్ముతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొంత సంయమనం పాటించే అవకాశం ఉందని తాను నమ్ముతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలపై  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు.

also read:నా మౌనాన్ని బలహీనతగా చూడొద్దు: ఉద్ధవ్ ఠాక్రే

రాష్ట్రంలో ప్రార్ధనా మందిరాలను తెరిచే విషయంలో గవర్నర్ కోశ్యారి సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాశాడు. ప్రార్ధనా మందిరాలను  తెరవడం వాయిదా వేయడానికి మీకేమైనా దైవ సందేశం అందిందా, లౌకికవాదిగా ఠాక్రే మారిపోయారా అని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

ఈ వ్యాఖ్యలపై సీఎం ఠాక్రే కూడ ఘాటుగానే స్పందించారు. తనకు హిందూత్వ సర్టిఫికెట్ గవర్నర్ నుండి అవసరం లేదని ఠాక్రే స్పష్టం చేశారు.గవర్నర్ రాసిన లేఖ రాజకీయంగా కలకలం రేపింది. దీంతో ఈ విషయమై అమిత్ షా స్పందించారు. సీఎం ఠాక్రేకు గవర్నర్ రాసిన లేఖను తాను చదివినట్టుగా ఆయన చెప్పారు. 

 

click me!