బంగారు మాస్కు... అయినా తప్పదు కరోనా రిస్కు

By Sreeharsha Gopagani  |  First Published Jul 5, 2020, 10:14 AM IST

పింప్రి చించ్‌వాడ‌కు చెందిన శంక‌ర్ కుర్‌హేడ్ అనే వ్య‌క్తి సుమారు 2 ల‌క్ష‌ల 90 వేల ఖ‌రీదైన గోల్డెన్ మాస్క్‌ను త‌యారు చేయించుకున్నాడు. ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్న‌ర తులాల బంగారం వాడిన‌ట్లు తెలుస్తోంది.  
 


క‌రోనా వైర‌స్ నుంచి త‌ప్పించుకోవాలంటే.. మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఈ నిబంధ‌న ఇప్పుడు దాదాపు అంద‌రూ పాటిస్తున్నారు. వెరైటీ వెరైటీ మాస్క్‌లు కూడా ధ‌రిస్తున్నారు.ఇక పుణెకు చెందిన ఓ వ్య‌క్తి మాత్రం ఏకంగా బంగారు మాస్క్‌ను పెట్టుకున్నాడు. 

పింప్రి చించ్‌వాడ‌కు చెందిన శంక‌ర్ కుర్‌హేడ్ అనే వ్య‌క్తి సుమారు 2 ల‌క్ష‌ల 90 వేల ఖ‌రీదైన గోల్డెన్ మాస్క్‌ను త‌యారు చేయించుకున్నాడు. ఈ మాస్క్ కోసం సుమారు అయిదున్న‌ర తులాల బంగారం వాడిన‌ట్లు తెలుస్తోంది.  

శంక‌ర్ అయిదు చేతి వేళ్ల‌కు బంగారు ఉంగ‌రాలు కూడా ఉన్నాయి.  అత‌ని మెడ‌లో భారీ పుత్త‌డి దండ కూడా ఉన్న‌ది. ఇప్ప‌టికే ధ‌గ‌ధ‌న మెరుస్తున్న అత‌నికి ఇప్పుడు గోల్డెన్‌ మాస్క్ కూడా తోడైంది. 

బంగారంతో త‌యారైన మాస్క్ మందంగా ఉన్న‌ద‌ని, వాటికి చిన్న చిన్న రంథ్రాలు ఉన్నాయ‌ని శంక‌ర్ తెలిపాడు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది లేద‌న్నాడు. అయితే ఈ మాస్క్ ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుందో చెప్ప‌లేమ‌న్నాడు. 

ఇకపోతే కరోనా కేసులు రోజురోజుకి అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటయిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఇదీ ఒకటన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ కూడా డేంజర్ జోన్‌లో ఉందని కేంద్రమంత్రి హెచ్చరించారు.

Latest Videos

ఇక ఇటీవల కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వానికి అడ్డంకి తొలిగింది కాబట్టి పాత సచివాలయ నిర్మాణాన్ని కూల్చివేయాలని చూస్తోందని... అలాకాకుండా పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలని కిషన్ రెడ్డి సూచించారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. 

కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని... తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు.  పాత సచివాలయంలో 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావొచ్చన్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు.  

లాక్‌డౌన్ విధించడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కిషన్‌రెడ్డి చెప్పారు. మాజీ ప్రధాని పీవీకి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని... పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు అంగీకరించిన ప్రధానికి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

click me!