Coronavirus: మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు !

By Mahesh Rajamoni  |  First Published Jun 16, 2022, 12:01 PM IST

Coronavirus: భార‌త్ లో క‌రోనా కొత్త కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే రానున్న నెల‌ల్లో మ‌రోసారి క‌రోనా వైర‌స్ పంజా విసిరే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 
 


Coronavirus: క‌రోనా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చి సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా.. దానికి వ్య‌తిరేకంగా టీకాలు అందుబాటులోకి వ‌చ్చినా.. దాని ప్రభావం మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ త‌న రూపు మార్చుకుంటున్న కోవిడ్‌-19 అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వెలుగులోకి వ‌చ్చిన ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్ర‌భావం క‌లిగించేవిగా ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు, వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొని ఉన్న క్ర‌మంలో భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. గ‌త‌వారం వ‌ర‌కు వంద‌ల్లో ఉన్న క‌రోనా కొత్త కేసులు న‌మోదు ప్ర‌స్తుతం వేల‌ల్లోకి చేరుకుంది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో 12,213 ఇన్ఫెక్షన్లు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో వైర‌స్ తో పోరాడుతూ 11 మంది ప్రాణాలు కోల్పోఒయారు. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ మ‌ర‌ణాల సంఖ్య 5,24,803 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌ శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 4,32,57,730 కోవిడ్-19 కేసులు న‌మోద‌య్యాయి.

Latest Videos

undefined

క‌రోనా కు సంబంధించిన టాప్-10 పాయింట్స్ ఇలా ఉన్నాయి.. 

1. దేశంలో గత 24 గంటల్లో 12,213 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన 8,822 కేసులతో పోలిస్తే.. 38.4 శాతం పెరిగాయి. ఫిబ్రవరి 26 తర్వాత ఒక్కరోజులో వైరల్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 10,000 దాటడం ఇదే తొలిసారి.

2. భారతదేశం క్రియాశీల కోవిడ్-19 కాసేలోడ్ ప్రస్తుతం 58,215 వద్ద ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.13 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

3. గత 24 గంటల్లో 7,624 రికవరీలతో, క‌రోనా వైరస్ నుండి కోలుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్య ఇప్పుడు 4,26,74,712కి చేరుకుంది.

4. దేశంలో కొత్త‌గా 11 కోవిడ్-19 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  కేరళ నుండి ముగ్గురు, మహారాష్ట్ర నుండి ఇద్దరు మరియు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక్కొక్క మ‌ర‌ణం నివేదించ‌బ‌డింది. 

5. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 1,375 కొత్త కేసులు నమోదవడంతో సానుకూలత రేటు 7.01 శాతానికి పెరిగింది. ఢిల్లీలో ఒక్కరోజులో 1,100 కేసులు నమోదు కావడం ఇది వరుసగా రెండో రోజు. ఇన్ఫెక్షన్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

6. మహారాష్ట్రలో 4,024 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 36 శాతం పెరుగుదల మరియు రెండు మహమ్మారి సంబంధిత మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 4,359 కేసులు నమోదైన ఫిబ్రవరి 12 తర్వాత బుధవారం కేసుల సంఖ్య అత్యధికం.

7. మ‌హారాష్ట్రలో కొత్తగా నాలుగు కరోనా వైరస్‌ బీఏ5 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ముంబై, థానే, నవీ ముంబై మరియు పూణేలలో కొత్త BA5 కేసులు నమోదయ్యాయి. నలుగురు రోగులు 19 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అధికారులు తెలిపారు. 

8, ముంబైలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 2,293 కొత్త ఇన్‌ఫెక్షన్‌లను నివేదించబ‌డ్డాయి. జనవరి 23 నుండి దాని రోజువారీ అత్యధిక కేసులు ఇవే. 

9. 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి COVID-19 వ్యాక్సినేషన్ 16 మార్చి 2022న ప్రారంభించబడింది. ఇప్పటివరకు, 3.53 కోట్ల (3,53,38,654) కంటే ఎక్కువ మంది యువకులకు COVID వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు. 

10. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,32,57,730 క‌రోనా కేసులు, 5,24,803 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 
 

click me!