ఢిల్లీ వెళ్లి వచ్చి దాక్కున్నారు... ఆ 21మందికి కరోనా పాజిటివ్

By telugu news team  |  First Published Apr 11, 2020, 11:40 AM IST

మర్కజ్‌కు వెళ్లిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న వారు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సమావేశానికి వెళ్లిన వారి జాబితాను రూపొందించి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్న విషయం తెలిసిందే.


దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కేసులు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 1500 కేసులు దాటాయి. తాజాగా మరో 21 మందికి కరోనా సోకినట్లు నిర్థారించారు. మహారాష్ట్రలో ఇంతలా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగి జమాత్. ఇక్కడకు వెళ్లి వచ్చిన తర్వాతే కుప్పలు తెప్పలుగా కేసులు పెరుగుతుండటం గమనార్హం.

Also Read భారత్ లో 239 మరణాలు..8వేలకు చేరువలో కరోనా కేసులు...

Latest Videos

అయితే మర్కజ్‌కు వెళ్లిన వారు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న వారు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ సమావేశానికి వెళ్లిన వారి జాబితాను రూపొందించి వైద్యపరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ముంబైకి సమీపంలోని ముబ్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ముబ్రా పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్‌ సీనియర్‌ అధికారి చేసిన ప్రత్యేక తనిఖీల్లో 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరందరూ మర్కజ్‌లో పాల్గొన్నవారిగా తేలింది. అయితే ఈ 21 మంది విదేశీయులకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలడంతో చికిత్స నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తనిఖీలను ముమ్మరం చేసింది. వీరు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారనే దాని ఆరా తీస్తున్నారు.  

ఈ 21 మందిలో 13 మంది బంగ్లాదేశీయలు, 8 మంది మలేషియన్లుగా గుర్తించారు.

click me!