నవంబర్ నాటికి ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ సిద్ధం, ధర ఎంతంటే...

By Sreeharsha Gopagani  |  First Published Jul 22, 2020, 6:22 PM IST

మహమ్మారి అంతుచూసే మందు ఇంకా రాకపోవడంతో అంతా కూడా వాక్సిన్ పైన్నే ఆశలు పెట్టుకున్నారు. వాక్సిన్ తయారీలో ముందున్న ఆక్స్ ఫర్డ్ పేజ్1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించింది.   


ప్రపంచమంతా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతోంది. నానాటికి కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో కరోనా కు భయపడని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. అన్ని దేశాలు కూడా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. 

ఈ మహమ్మారి అంతుచూసే మందు ఇంకా రాకపోవడంతో అంతా కూడా వాక్సిన్ పైన్నే ఆశలు పెట్టుకున్నారు. వాక్సిన్ తయారీలో ముందున్న ఆక్స్ ఫర్డ్ పేజ్1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించింది.   

Latest Videos

పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ తో వారు తయారీకి ఒప్పందము కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీరం అధినేత అదర్ పూనావాలా మాట్లాడుతూ...  ట్రయల్స్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, నవంబర్ నాటికి వాక్సిన్ సిద్ధమవ్వొచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. 

వాక్సిన్ ని అందరికి అందుబాటు ధరలో ఉంచేందుకు ఆలోచించి 1000 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపారు పూనావాలా. ఆగస్టు నాటికి అన్ని చర్యలు చేపడుతూనే 5000 మందిపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయిఉన్నట్టు తెలిపాడు. 

అన్ని అనుకున్నట్టుగా సాగితే వచ్చే ఏడాది జూన్ నాటికి వాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసాడు పూనావాలా. ప్రస్తుతానికి అన్ని క్లినికల్ ట్రయల్స్ లో కూడా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన అన్నారు, త్వరలోనే దీనికి సంబంధించి డ్రగ్ కాంట్రా అథారిటీకి ఒక నివేదిక సమర్పించనున్నట్టుగా తెలిపాడు. 

అనుమతులు రాగానే మరో రెండు మూడు వారాల్లో పూణే, ముంబై కి చెందిన 5000 మందిపై ట్రయల్స్ నిర్వహించనున్నట్టుగా తెలిపారు పూనావాలా. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ తో పాటుగా మన హైదరాబాద్ కి చెందిన భరత్ బయోటెక్ సైతం ఈ వాక్సిన్ రూపకల్పనలో ముందంజలో ఉంది. 

click me!