దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా: భారీగా పెరిగిన రికవరీ రేటు

By narsimha lode  |  First Published Oct 27, 2020, 1:21 PM IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 50వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం దేశంలో ఈ నెలలో ఇది రెండోసారి.



న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 50వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం దేశంలో ఈ నెలలో ఇది రెండోసారి.

108 రోజుల తర్వాత కరోనాతో మరణించిన వారి సంఖ్య 500 లోపు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి.దేశంలోని కరోనా కేసుల సంఖ్య 79 లక్షల 09 వేల 959 కి చేరుకొంది. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 1,19,014కి చేరుకొంది. కరోనా నుండి ఇప్పటివరకు 71 లక్షల 37 వేల 228 మంది కోలుకొన్నారని ప్రభుత్వం తెలిపింది.

Latest Videos

undefined

కరోనా రోగుల రికవరీ రేటు 90.23 కు చేరుకొంది. కరోనాతో మరణించే రోగుల సంఖ్య 1.50 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కరోనా వైరస్ యాక్టివ్ కేసుల శాతం 7.88 గా ఉంది. దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నాలుగు రోజులుగా 7 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి. 

దేశంలో కరోనా కేసులను తగ్గించేందుకు గాను కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తులు చేస్తోంది. 

click me!