ఇండియాలో పదివేలు దాటిన కరోనా కేసులు: 339 మంది మృతి

By telugu news teamFirst Published Apr 14, 2020, 9:55 AM IST
Highlights
గత 14 రోజులుగా దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ తో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. మహారాష్ట్రలో 2,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 10,363 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి 339 మంది మరణించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1035 మంది కోలుకున్నిారు. గత 24 గంటల్లో కొత్తగా 1,211 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 31 మంది మరణించారు.

 గత 14 రోజులుగా దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ తో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. మహారాష్ట్రలో 2,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 160 మంది మరణించారు.  గత 24 గంటల్లో కొత్తగా 352 కేసులు నమోదు కాగా, 11 మంది మృత్యువాత పడ్డారు. ముంబైలో 1,540 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 101 మంది మృత్యువాత పడ్డారు.

సోమవారంనాటి లెక్కల ప్రకారం కర్ణాటకలో 8 మంది కరనా పాజిటివ్ తో మరణించారు. బెంగళూరులో సోమవారంనాడు 65 ఏళ్ల వ్యక్తి మరణిం్చాడు. దీంతో మృతుల సంఖ్య 8కి పెరిగింది. ఇదిలావుంటే, ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ గడువు నేటితో ముగుస్తుండడంతో తర్వాతి వ్యూహాన్ని ఆయన వివరించనున్నారు. లాక్ డౌన్ విధానాన్ని ఆయన ప్రకటించే అవకాశం ఉంది.
click me!