ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవీ...

By telugu teamFirst Published Mar 24, 2020, 9:36 AM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మంగళవారం ఉదయానికి 492 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రను కరోనా వైరస్ కుదిపేస్తోంది. 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది.

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల సంఖ్య 500కు చేరువలో ఉంది. మంగళవారం ఉదయానికి భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 492కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. మణిపూర్ లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

మిజోరం, మణిపూర్ మినహా రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య పదికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. రోడ్ల మీదికి వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

మహారాష్ట్ర 84, మరణాలు 3
ఆంధ్రప్రదేశ్ 7
కర్ణాటక 37, మరణాలు 1
మణిపూర్ తొలి కరోనా కేసు
తమిళనాడు 12
తెలంగాణ 33
బీహార్ 2, మరణాలు 1
రాజస్తాన్ 26
పంజాబ్ 21, మరణాలు 1
పశ్చిమ బెంగాల్ 7 మరణాలు 1
ఉత్తరప్రదేశ్ 33
చత్తీస్ గడ్ 1
హర్యానా 12
హిమాచల్ ప్రదేశ్ 3, మరణాలు 1
మధ్యప్రదేశ్ 7
ఒడిశా 2
లడక్ 3
ఉత్తరాఖండ్ 3
కేరళ 87
గుజరాత్ 29, మరణాలు 1
ఢిల్లీ 30 మరణాలు 1

దేశంలోని 30 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. మొత్తం 548 జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా ల్లో పాక్షికంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ రాష్ట్రాల్లోని 80 జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. సోమవారంనాడు ఒక్క రోజే 75 తాజా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యయ్యాయి.  వారిలో 41 మంది విదేశీయులు.  

గుజరాత్, బీహార్, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి. 

click me!