భారత్ లో కరోనా... 20వేలకు చేరువైన మరణాలు, 24గంటల్లో...

By telugu news team  |  First Published Jul 6, 2020, 10:38 AM IST

ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..గత 24గంటల్లో 24వేల కేసులు నమోదయ్యాయి. కాగా.. నిన్న ఒక్కరోజే 613 మంది మృత్యువాతపడ్డారు. ఇక మరణాల సంఖ్య కూడా 20 వేలకు చేరువయ్యింది.


భారత్ లో కరోనా వికృత రూపం దాలుస్తోంది. ఊహించని రీతిలో ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే.. భారత్ కరోనా విషయంలో ప్రపంచ దేశాలలో మూడో స్థానానికి చేరుకుంది. కాగా.. ఆదివారం కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం.

ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..గత 24గంటల్లో 24వేల కేసులు నమోదయ్యాయి. కాగా.. నిన్న ఒక్కరోజే 613 మంది మృత్యువాతపడ్డారు. ఇక మరణాల సంఖ్య కూడా 20 వేలకు చేరువయ్యింది.

Latest Videos

దాంతో మొత్తం 673,000 కేసులకు,19,268 మరణాలకు చేరుకుంది. కేసుల జాబితాలో భార‌త్ మూడో స్థానానికి ఎగ‌బాకింద‌ని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది.

అమెరికా 28 ల‌క్ష‌లు , బ్రెజిల్ 15 ల‌క్ష‌లు త‌ర్వాత స్థానంలో భార‌త్ నిలిచింది. మొత్తం పాజిటివ్ కేసులలో 4,24,433 మంది రికవరీ అయ్యారు. దీంతో రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. ప్రస్తుతం సోమవారం నాటికి యాక్టీవ్ కేసులు 2,53,287 ఉన్నాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును దాటగా.. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు వచ్చాయి.

click me!