కిడ్నాప్ చేసి... ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ చల్లి...

Published : Jul 06, 2020, 09:05 AM ISTUpdated : Jul 06, 2020, 09:08 AM IST
కిడ్నాప్ చేసి... ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ చల్లి...

సారాంశం

లాక్ డౌన్ సడలింపుల తర్వాత అతను మే 7వ తేదీన పూణే చేరుకున్నాడు. కాగా.. అతను 17 రోజులు క్వారంటైన్ లో భాగంగా హోటల్ లో ఉండాల్సి వచ్చింది. అక్కడ బిల్లు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో.. అతను తన సెల్ ఫోన్, డెబిట్ కార్డు తనఖా పెట్టడం గమనార్హం. 

తమ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని.. ఆ కంపెనీ యజమాని కిడ్నాప్ చేశాడు. మరో ఇద్దరి సహాయంతో కిడ్నాప్ చేసి.. చిత్ర హింసలకు గురిచేశాడు. అంతేకాకుండా.. అతని ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ కూడా చల్లాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.కంపనీ పనిమీద అతను ఢిల్లీ వెళ్లాడు.  కాగా.. లాక్ డౌన్ కి ముందు అతనికి సంస్థ కొంత డబ్బులు అప్పగించింది. ఆ తర్వాత లాక్ డౌన్ విధించడంతో.. కంపెనీ డబ్బులతో సహా ఢిల్లీలో ఉండిపోయాడు.

లాక్ డౌన్ సడలింపుల తర్వాత అతను మే 7వ తేదీన పూణే చేరుకున్నాడు. కాగా.. అతను 17 రోజులు క్వారంటైన్ లో భాగంగా హోటల్ లో ఉండాల్సి వచ్చింది. అక్కడ బిల్లు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో.. అతను తన సెల్ ఫోన్, డెబిట్ కార్డు తనఖా పెట్టడం గమనార్హం. లాక్ డౌన్ సమయంలో అతను కంపెనీ డబ్బుని కొంత ఖర్చు చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఖర్చు చేసిన డబ్బు ఇవ్వాలంటూ సదరు వ్యక్తిని కంపెనీ యజమాని అతనిని వేధించడం మొదలుపెట్టాడు. మరో ఇద్దరితో కలిసి సదరు ఉద్యోగిని కిడ్నాప్ చేశాడు. అతని ప్రైవేట్ పార్ట్స్ పై శానిటైజర్ చల్లుతూ డబ్బు కోసం చిత్రవధ చేయడం గమనార్హం. కాగా.. వారి బంధీ నుంచి తప్పించుకున్న సదరు ఉద్యోగి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు