8 రోజుల్లో లక్ష కొత్త కేసులు: ఇండియాలో 4,25,282కి చేరిన కోవిడ్ కేసులు

By narsimha lode  |  First Published Jun 22, 2020, 10:14 AM IST

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలను  దాటింది. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. గత   24 గంటల్లో 14,821 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.



న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలను  దాటింది. ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. గత   24 గంటల్లో 14,821 కొత్త కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారంగా దేశంలో సోమవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 4,25,282కి చేరుకొన్నాయి. వీటిలో 1,74,387 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది.  కరోనా సోకిన 2,37,196 మంది కోలుకొన్నట్టుగా హెల్త్ బులెటిన్ ప్రకటించింది.

Latest Videos

గత 24 గంటల్లో 445 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,699కి చేరుకొంది.ఆదివారం నాడు దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క రోజులోనే 15,413 కరోనా కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.

అయితే కరోనా సోకిన రోగుల్లో కోలుకొంటున్నవారి సంఖ్య పెరిగినట్టుగా కేంద్రం తెలిపింది. గతంతో పోలిస్తే రికవరీ రోగుల  సంఖ్య55.48 శాతానికి చేరుకొందని ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర అగ్ర స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు నిలిచింది. మహారాష్ట్రలో 1,28,205 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 56,845 కేసులు రికార్డు అయినట్టుగా హెల్త్ బులెటిన్ తెలిపింది.

ఇక డిల్లీలో 56,746, గుజరాత్ రాష్ట్రంలో 26,680, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 16,594, రాజస్థాన్ లో 14,536, బెంగాల్ రాష్ట్రంలో 13,531 కేసులు రికార్డయ్యాయని కేంద్రం ప్రకటించింది.

also read:మహరాష్ట్రపై కరోనా పంజా: ఒక్కరోజే 88 మంది పోలీసులకు కోవిడ్, ఒక్కరు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11,724, హర్యానాలో 10,223 కేసులు నమోదైనట్టుగా కేంద్రం వెల్లడించింది.థానే సెంట్రల్ జైలు వద్ద పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. వారిని ఆసుపత్రికి తరలించారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి హోం క్వారంటైన్ కు తరలించారు.

జమ్మూ కాశ్మీర్ లో 122 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 5956కి చేరుకొన్నాయి.బీహార్ రాష్ట్రంలో 7,665 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇందులో 1983 యాక్టివ్ కేసులు ఇప్పటివరకు 51 మంది మరణించారు.

 

click me!