బైక్ పై స్టంట్స్.. బెడసికొట్టి ముగ్గురు మృతి

Published : Jun 22, 2020, 10:12 AM IST
బైక్ పై స్టంట్స్.. బెడసికొట్టి ముగ్గురు మృతి

సారాంశం

విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేశారు. బైక్ స్టంట్స్ చేయ‌బోయిన క్ర‌మంలో.. బైక్‌ అదుపు త‌ప్పి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. 

 ఓ ముగ్గురు యువకులు బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.  బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో ఆదివారం  ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని గోవిందపుర ప్రాంతానికి చెందిన ముగ్గురు యువ‌కులు ఆదివారం తెల్ల‌వారుజామున బైక్ ‌పై బ‌య‌ట‌కు వెళ్లారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై బైక్‌తో విన్యాసాలు చేశారు. బైక్ స్టంట్స్ చేయ‌బోయిన క్ర‌మంలో.. బైక్‌ అదుపు త‌ప్పి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న యెలహన్క పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం