24 గంటల్లో 19,459 కొత్త కేసులు: ఇండియాలో మొత్తం 5,48,318కి చేరిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jun 29, 2020, 10:37 AM IST
Highlights

గత 24 గంటల్లో కరోనా కేసులు 19 వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 5.48 లక్షలకు చేరుకొన్నాయి. దేశంలో వరుసగా ఆరో రోజు కరోనా కేసులు 15 వేలకు పైగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో కరోనా కేసులు 19 వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 5.48 లక్షలకు చేరుకొన్నాయి. దేశంలో వరుసగా ఆరో రోజు కరోనా కేసులు 15 వేలకు పైగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరుకొన్నాయి. వీటిలో 2,10,120 యాక్టివ్ కేసులు.కరోనా సోకిన 3,21,723 మంది రోగులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనాతో దేశంలో 16,475 మంది మరణించారు.

అయితే గత 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదైనప్పటికీ ఒక్కరు కూడ మరణించలేదని కేంద్రం ప్రకటించింది.ఈ నెల 27వ తేదీ వరకు 82,27,802 శాంపిల్స్ పరీక్షించారు. శనివారం నాడు ఒక్క రోజే 2,31,095 శాంపిల్స్ పరీక్షించినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో డోర్ టూ డోర్ సర్వే నిర్వహించనున్నారు. ఢిల్లీ, గోవా, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివారం నాటి నుండి 14 రోజుల పాటు లాక్ డౌన్ ప్రారంభమైంది.

కరోనా సోకిన రోగుల్లో 58.67 శాతం మంది కోలుకొన్నట్టుగా కేంద్రం తెలిపింది.కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు 4,189కి చేరుకొన్నాయి. తాజాగా రాష్ట్రంలో 118 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు హెల్త్ వర్కర్లు కూడ ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలోని మండోలి జైలులో మరో ఐదుగురికి కరోనా సోకింది.ఢిల్లీలో తాజాగా 2889 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 83 వేలకు చేరుకొన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 2623 మంది మరణించారు.

పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో మరో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో మరణించినవారి సంఖ్య 133కి చేరుకొంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5216కి చేరుకొన్నాయి.  వీటిలో 161 కొత్త కేసులు.

బీహార్ రాష్ట్రంలో నలుగురు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9224కి చేరుకొన్నాయి. తాజాగా 245 కొత్త కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.

click me!