భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు, 3వేలు దాటిన మరణాలు

Published : May 19, 2020, 08:39 AM ISTUpdated : May 19, 2020, 09:00 AM IST
భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు, 3వేలు దాటిన మరణాలు

సారాంశం

గత 24 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 4,630 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 131 మంది కరోనా కారణంగా మరణించారు. కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష దాటేశాయి.మొత్తంగా 100,328 కేసులు నమోదు కాగా 3,156 మంది మరణించారు.

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసులు భారీగా పెరగడం గమనార్హం. దాదాపుగా ప్రతీ రోజు కూడా 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న తొలిసారి 5 వేల కేసులు దాటాయి దేశంలో. 

 ఇక నేడు కూడా దాదాపుగా 5 వేల కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 4,630 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 131 మంది కరోనా కారణంగా మరణించారు. కాగా.. దేశంలో కరోనా కేసులు లక్ష దాటేశాయి.మొత్తంగా 100,328 కేసులు నమోదు కాగా 3,156 మంది మరణించారు.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు నెలలుగా కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఇప్పటివరకు 92మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

ఎయిమ్స్ ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన అధ్యాపకునికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో దాదాపు పదిమంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. మొత్తం 92మందిలో ఒకరు అధ్యాపకులు, ఇద్దరు రెసిడెంట్‌ వైద్యులు, 13మంది నర్సింగ్‌ సిబ్బంది, 45మంది సెక్యూరిటీ గార్డులతో పాటు మరో 12మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలాఉండగా దిల్లీలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలు దాటగా 160మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 35,058 కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !