కరోనా విజృంభణ: రాష్ట్రపతి భవన్ లో పాజిటివ్ కేసు, క్వారంటైన్ కు వందకు పైగా

By telugu teamFirst Published Apr 21, 2020, 9:07 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సముదాయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్ సముదాయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ సముదాయంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో దాదాపు వంద మందిని క్వారంటైన్ కు తరలించారు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నాలుగు రోజుల క్రితం తేలింది. మిగతా అందరికీ నెగెటివ్ వచ్చింది. సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లాలని 125 కుటుంబాలను అధికారులు ఆదేశించారు. హౌస్ కీపింగ్ స్ఠాఫ్ కు కరోనా పాజిటి వచ్చింది.

కాగా, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశంలో 18 వేలు దాటింది. మొత్తం 18,601 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 590కి చేరుకుంది. 

గత 24 గంటల్లో కొత్తంగా 945 కోవిడ్ - 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 14,255 యాక్టివ్ కేసులు. 2,841 మంది చికిత్స పొంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 4,203 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానం ఢిల్లీ ఆక్రమిస్తోంది. ఢిల్లీలో 2,003 కేసులు నమోదయ్యాయి. 

గుజరాత్ 1,851 కేసులతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 1,485 కేసులతో మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో, 1,477 కేసులతో తమిళనాడు ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిల్లోనూ క్యాంటీన్లను మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 

click me!