దేశంలో 35,043కి చేరిన కరోనా కేసులు, ట్రక్కుల రవాణకు అనుమతి: కేంద్రం

By narsimha lode  |  First Published May 1, 2020, 4:30 PM IST

గత 24 గంటల్లో 1993 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇవాళ్టికి 35,043 కేసులునమోదైనట్టుగా ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు 1,147 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.



న్యూఢిల్లీ:గత 24 గంటల్లో 1993 కేసులు నమోదయ్యాయి..దీంతో ఇవాళ్టికి 35,043 కేసులునమోదైనట్టుగా ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు 1,147 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.

శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలో 25,005 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 8,889 మంది కరోనా నుండి కోలుకొన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు.

Latest Videos

గత 24 గంటల్లో 563 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 25.37 శాతానికి చేరుకొందని కేంద్రం ప్రకటించింది.కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి జిల్లాను మూడు జోన్లుగా విభజించినట్టుగా కేంద్రం తెలిపింది. 

బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు కూడ కరోనా వ్యాప్తి చెందకుండా పోరాటం చేస్తున్నారని కేంద్రం ప్రకటించింది.సీఆర్‌పీఎఫ్ కూడ ప్రజలకు నిత్యావసర సరుకులను స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు.

ట్రక్కుల రవాణాకు కేంద్రం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చినట్టుగా కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.సరుకుల రవాణకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. 

also read:కరోనాకు మహారాష్ట్రలో తొలి ప్లాస్మా థెరపీ చికిత్స: రోగి మృతి

సప్లై చెయిన్స్ కు ఇబ్బంది లేకుండా రాష్ట్రాలు చూసుకోవాలని కేంద్రం కోరింది. వలసకూలీలు, విద్యార్థులు తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసింది.లస కూలీలు, విద్యార్థుల తరలింపుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సమయంలో కచ్చితంగా నిబంధనలను పాటించాలని కేంద్ర హోంశాఖ సూచించింది.

62 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రాలు సేకరించిన విషయాన్ని కేంద్రం తెలిపింది. నిత్యావసర సరుకులకు దేశంలో ఎలాంటి కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

click me!