
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57, 229 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,449 మంది కరోనాతో మృతి చెందారు.
24 గంటల్లో 3,20,289 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ కొత్త కేసులతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 2,02,82,833కి చేరుకున్నాయి. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి సంక్య 1,66,13,292గా ఉంది.
అలాగే ప్రస్తుతం 34,47,133 యాక్టీవ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,22,408గా ఉంది. ఇప్పటివరకు 15,89,32,921 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 6876 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 4,63, 361కి చేరుకొన్నాయి. కరోనాతో గత 24 గంటల్లో 59 మంది మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,476కి చేరుకొంది. రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 70,961 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 3,854 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.
గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో113, భద్రాద్రి కొత్తగూడెంలో 121, జీహెచ్ఎంసీ పరిధిలో 1029, జగిత్యాలలో211,జనగామలో 65, జయశంకర్ భూపాలపల్లిలో78, గద్వాలలో96 కామారెడ్డిలో 118, కరీంనగర్ లో 264,ఖమ్మంలో 235, మహబూబ్‌నగర్లో 229, ఆసిఫాబాద్ లో 84, మహబూబాబాద్ లో133, మంచిర్యాలలో 188,మెదక్ లో 30 కేసులు నమోదయ్యాయి.
మల్కాజిగిరిలో502,ములుగులో44,నాగర్ కర్నూల్ లో 190,నల్గగొండలో402, నారాయణపేటలో29, నిర్మల్ లో 58, నిజామాబాద్ లో218,పెద్దపల్లిలో96,సిరిసిల్లలో107,రంగారెడ్డిలో387, సిద్దిపేటలో 258 సంగారెడ్డిలో320,సూర్యాపేటలో258, వికారాబాద్ లో 171, వనపర్తిలో123, వరంగల్ రూరల్ లో 109,వరంగల్ అర్బన్ 354, యాదాద్రి భువనగిరిలో 183 కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona