అబ్బాయి.. అమ్మాయిలా పరిచయం చేసుకొని.. యువకులకు వల విసిరి..!

By telugu news teamFirst Published Sep 1, 2021, 10:17 AM IST
Highlights

తాను ఒక ఎన్‌ఆర్‌ఐకు చెందిన యువతి అని, కెనడాలో ఉంటానని చెప్పుకునే వాడు. అతగాడి మెసెజ్‌కు రిప్లై ఇచ్చిన వారితో కొన్నిరోజులు చాటింగ్‌ చేసేవాడు.

రోజు రోజుకీ సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త వారితో పరిచయాలు పెంచుకోవాలనే ఆతురత తిప్పలు తెచ్చిపెడుతోంది. తాజాగా.. ఓ అబ్బాయి చేతిలో  చాలా మంది యువకులు దారుణంగా మోసపోయారు. ఓ యువకుడు.. తనని తాను అమ్మాయిగా పరిచయం చేసుకొని.. తానొక ఎన్ఆర్ఐ అని నమ్మించి.. చాలా మంది యువకులను దారుణంగా మోసం చేశాడు. వారి నుంచి నగ్న వీడియోలు సేకరించి.. వాటితోనే వారిని బ్లాక్ మొయిల్ చేసి డబ్బులు గుంజాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యూపీకి చెందిన 23 ఏళ్ల యువకుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలలో అనేక నకిలీ ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేశాడు.  ఆ తర్వాత అనేక మంది యువతులకు రిక్వెస్ట్‌ పేట్టేవాడు. తాను ఒక ఎన్‌ఆర్‌ఐకు చెందిన యువతి అని, కెనడాలో ఉంటానని చెప్పుకునే వాడు. అతగాడి మెసెజ్‌కు రిప్లై ఇచ్చిన వారితో కొన్నిరోజులు చాటింగ్‌ చేసేవాడు.

ఆ తర్వాత అవతలి అమ్మాయికి తన నకిలీ అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపేవాడు. అంతటితో ఆగకుండా నువ్వుకూడా నీ న్యూడ్‌ ఫోటోలు, వీడియోలను పంపాలని కోరేవాడు. ఈ క్రమంలో అతగాడి మాయలో పడిన కొందరు వారి ఫోటోలు పంపగానే తన అసలు రంగును బయటపేట్టేవాడు. వారిని డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడేవాడు. అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే ఫోటోలను,  వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించేవాడు.

ఈ క్రమంలో ఆ దుర్మార్గుడికి 15 ఏళ్ల బాలిక ఇన్‌స్టాలో పరిచయం అయ్యింది. ఆమెను ఇలాగే వేధింపులకు పాల్పడ్డాడు. అయితే, సదరు యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. వారు వెంటనే యూపీలోని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

click me!