తమిళనాడు: తేలని సీట్ల పంచాయతీ.. విచ్ఛిన్నం దిశగా డీఎంకే- కాంగ్రెస్ కూటమి..?

By Siva KodatiFirst Published Mar 4, 2021, 3:30 PM IST
Highlights

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ సీట్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. వీలైనన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేయాలని డీఎంకే డిసైడ్ అయ్యింది. గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు ఇచ్చినా గెలవకపోవడంతో ఈసారి డీఎంకే.. తన మిత్రపక్షాలకు తక్కువ సీట్లు కేటాయించాలని నిర్ణయించింది.

అయితే కాంగ్రెస్ తన వాటాగా 35 సీట్లు ఇవ్వాలని  డీఎంకేను అడుగుతోంది. 23 సీట్లు మాత్రమే ఇస్తామని.. అంతకుమించి ఇవ్వలేమని డీఎంకే తేల్చి చెబుతోంది. అటు కాంగ్రెస్‌కు అడిగినన్ని సీట్లు ఇవ్వలేక , అలాగని కాంగ్రెస్‌ను వదిలించుకోలేని స్థితిలో డీఎంకే చీఫ్ స్టాలిన్ మల్లగుల్లాలు పడుతున్నారు.

కనీసం 30 సీట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు. కూటమిలో కొనసాగాలా వద్దా..? అనే  దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి 18 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా లేదని సమాచారం. అలాగే కూటమిలో మిగతా పార్టీలకు కేవలం మూడు, నాలుగు సీట్లు ఇస్తామనడంతో ఆయా పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

డీఎంకేను ఒప్పించడంలో విఫలమైతే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యంతో కలిసి వెళ్లే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. గత ఎన్నికల్లో 40 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 8 చోట్ల మాత్రమే గెలవడం డీఎంకే భయానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

click me!