ప్రముఖ సివిల్స్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు శంకరన్ ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 2:40 PM IST
Highlights

దేశ సేవకోసం అనేక మంది సివిల్ సర్వెంట్స్ ని తయారుచేసిన శంకరన్‌ ఐఏఎస్ అకాడమి వ్యవస్థాపకులు శంకరన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలతోని వివిధ రాష్ట్రాల్లో ఈ అకాడమీ కార్యాలయాలున్నాయి. అయితే కుటుంబ కలహాలతో పాటు కోచింగ్ సెంటర్ల మధ్య నెలకొన్న పోటీ కారణంగా శంకరన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

దక్షణ భారతదేశంలోనే సివిల్స్‌ కోచింగ్‌‌కు పేరుగాంచిన సంస్థగా శంకరన్‌ ఐఏఎస్ అకాడమి. చెన్నైతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ అకాడమీ బ్రాంచ్‌లున్నాయి.   వీటి ద్వారా వేలాది మందికి సివిల్స్‌ పరీక్షలకు సిద్దమవుతున్నారు. ఈ అకాడమీలో శిక్షణ తీసుకున్న దాదాపు 900 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. చాలా మంది సివిల్ సర్వెంట్లుగా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. 

అంతేకాకుండా ప్రస్తుతం 1,500 మంది శిక్షణ పొందుతున్నారు. దేశంలోని ఇతర ఐఏఎస్‌ శిక్షణ సంస్థల నుండి పోటీని తట్టుకుని శంకరన్ అకాడమీ తమిళనాడులో మంచి గుర్తింపు సాధించింది. 
 
మృతుడు శంకరన్‌కు భార్య వైష్ణవి (42), సాగణ (12), సాధన (05) అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ కుటుంబం చెన్నై మైలా పూరు కృష్ణస్వామి అవెన్యూలో నివసిస్తున్నారు.  అయితే రాత్రి బెడు రూం లో శంకరన్ బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!