అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

By Nagaraju penumalaFirst Published Aug 21, 2019, 8:33 PM IST
Highlights

24 గంటల అజ్ఞాంతం అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చిదంబరం తాను ఎక్కడికో పారిపోయానని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. 
 

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు ఎలాంటి ప్రమేయం  లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ఏడు నెలలుగా కుట్రపూరిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

24 గంటల అజ్ఞాంతం అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చిదంబరం తాను ఎక్కడికో పారిపోయానని, అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. 

ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. బుధవారం రాత్రి ఈ కేసుకు సంబంధించి తాను తన లాయర్లతో ఉన్నట్లు తెలిపారు. తాను ఇప్పటికీ ఎప్పటికీ ధర్మాన్ని నమ్ముతానన్నారు. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు గానీ తన కుమారుడికి గానీ ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సీబీఐ చార్జిషీట్ లో గానీ, ఈడీ చార్జిషీట్ లో గానీ తనపై ఎలాంటి కేసు లేదన్నారు. కనీసం తన పేరు కూడా లేదని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా తన బెయిల్ తిరస్కరించిందని తెలిపారు. 

సహచరుల ఆలోచనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఫైల్స్ అన్నీ బుధవారం రాత్రి సిద్ధం చేసి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తన లాయర్లు సుప్రీంకోర్టును ఎంత వేడుకున్నా శుక్రవారంకు విచారణకు ఆదేశించిందని తెలిపారు. 

తాను ఎవరికీ తలవంచనని కేవలం ధర్మానికి, న్యాయానికి మాత్రమే తలవంచుతానన్నారు. తనకు చట్టాలు అంటే ఎంతో గౌవరం అని చెప్పుకొచ్చారు. తనకు శుక్రవారం వరకు స్వేచ్ఛ ఉందని అప్పటి వరకు తనను అరెస్ట్ చేయరని నమ్మకం ఉందన్నారు. 

విచారణ సంస్థలు కూడా చట్టాన్ని గౌరవించాలని కోరారు. దేశంలో ప్రతీ పౌరుడు స్వేచ్ఛను జడ్జి గౌరవిస్తారని తాను నమ్ముతున్నానని శుక్రవారం వరకు తనకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందన్నారు. 
 

click me!