దమ్ముంటే ఆ పనులు చేయండి .. ప్రధాని మోడీకి కాంగ్రెస్ బహిరంగ సవాల్ .. ఇంతకీ ఆ సవాళ్లేంటి?

Published : Jun 11, 2023, 05:24 AM IST
 దమ్ముంటే ఆ పనులు చేయండి .. ప్రధాని మోడీకి కాంగ్రెస్ బహిరంగ సవాల్ .. ఇంతకీ ఆ సవాళ్లేంటి?

సారాంశం

గాడ్సే గురించి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన ప్రకటన తర్వాత కాంగ్రెస్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ట్వీట్ చేస్తూ.. ప్రధానమంత్రికి సవాలు విసిరింది.

మహాత్మ గాంధీని హత్య చేసి నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ బీజేపీ నేతలు చేసిన  వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహాత్మా గాంధీని హతమార్చిన గాడ్సే ఆరాధకులకు ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ నుంచి తరిమికొట్టాలని లేదా గాంధీ విగ్రహాల ముందు వంగి వంగి నమస్కరించే విధానానికి స్వస్తి చెప్పాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. గాడ్సేను భరతమాత సుపుత్రుడని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నాడని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు బట్టింది. 

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ప్రధానమంత్రి మోడీని లక్ష్యంగా చేసుకుంది. మరో బిజెపి నాయకుడు, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కొద్ది రోజుల క్రితం గాడ్సేను "దేశభక్తుడు" అని పిలిచిన విషయం కూడా తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేతలు గాడ్సేను కీర్తిస్తున్నప్పటికీ.. ప్రధాని మోడీ ఏమీ మాట్లాడటం లేదనీ, వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ఇటీవల జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మహాత్మా గాంధీ విగ్రహం ముందు వంగి నమస్కరిస్తున్న చిత్రాన్ని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసి.. ప్రధానికి ఓ సవాల్ విసిరింది. బీజేపీ నుండి గాడ్సే భక్తులను తరిమివేయాలి లేదా మహాత్మ గాంధీజీ ముందు వంగి నమస్కరించే పద్దతికి  స్వస్తి చెప్పాలి. ఈ దేశంలో గాడ్సేను ఆరాధించేవారికి స్థానం లేదనీ, ఈ  విషయంలో  ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవాలని ఉందని కాంగ్రెస్ సవాల్ వేసింది.

గిరిరాజ్ సింగ్ ఏమన్నారంటే.. 

బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ శుక్రవారం నాడు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గాడ్సేను భరతమాత సుపుత్రుడు అని అభివర్ణించారు. మహాత్మ గాంధీ హంతకుడు మొగల్ పాలకులైన బాబర్, ఔరంగజేబ్‌ లాగా.. ఆక్రమణదారు కాదని, గాడ్సే గడ్డపై పుట్టినవాడని అన్నారు. బాబర్, ఔరంగజేబులను వారసుల్లా భావించేవారు భరతమాత వారసులు కాదన్నారు. గాడ్సే.. గాంధీ హంతకుడైనా.. అతడు భరతమాత సుపుత్రుడే'' అని వ్యాఖ్యానించారు. 

ఇంతకీ ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఏమన్నారంటే..?  
 
ఈ వారం ప్రారంభంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రావత్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ గాడ్సేను దేశభక్తుడు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిని ఉద్దేశించి రావత్ మాట్లాడుతూ.. కేవలం గాంధీ ఇంటిపేరు కలిగి ఉండటం వల్ల అతని భావజాలం గాంధేయవాదం కాదని అన్నారు. "గాంధీజీ చంపబడ్డాడు, అది వేరే విషయం. కానీ నేను గాడ్సేను అర్థం చేసుకున్న, చదివినంత వరకు, అతను కూడా దేశభక్తుడే. గాంధీజీని చంపడాన్ని మేము అంగీకరించము" అని రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీపై కాంగ్రెస్ దాడి 

బిజెపి నేతల వ్యాఖ్యాల నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ కూడా ప్రధానిని టార్గెట్ చేశారు. గత వారం రోజుల క్రితం నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ప్రశంసించగా.. ఇప్పుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆయన్ను ప్రశంసించారు. కానీ మహాత్ముడి కళ్లద్దాలను స్వచ్ఛ భారత్‌కు చిహ్నంగా మార్చిన వ్యక్తి .. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు

బిజెపి నేతల వ్యాఖ్యాలను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ.. "మహాత్మా గాంధీ జాతిపిత. ఆయనను హతమార్చిన వ్యక్తిని కీర్తించడం దేశ వ్యతిరేక చర్య. కానీ మీరు బిజెపిలో ఉంటే, గాడ్సేను జరుపుకోవడం గౌరవ బ్యాడ్జ్. రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రి గిరిరాజ్ సింగ్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవలి ప్రకటనలు చేయడం వారి పార్టీ ఆలోచనల విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి మౌనం.. వారి ప్రతి మాటను ఆయన కూడా ఆమోదిస్తున్నట్లు తెలియజేస్తుంది." అని విమర్శలు గుప్పించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌