ముంచుకొస్తున్న ఎన్నికలు: అసంతృప్తులకు పదవులు.. కాంగ్రెస్ హైమాండ్ స్కెచ్

By Siva KodatiFirst Published Jan 3, 2021, 3:22 PM IST
Highlights

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ హైకమాండ్ అరవ నేలపై ఫోకస్ పెట్టింది. పదవులు లేక అసంతృప్తితో వున్న నేతలు వలస పోకుండా వారిని సంతృప్తిపరిచే నిర్ణయాన్ని తీసుకుంది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ హైకమాండ్ అరవ నేలపై ఫోకస్ పెట్టింది. పదవులు లేక అసంతృప్తితో వున్న నేతలు వలస పోకుండా వారిని సంతృప్తిపరిచే నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ)కి కొత్తగా 32మందిని ఉపాధ్యక్షులుగా, 57 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 104 మందిని కార్యదర్శులుగా నియమించింది.

ఇందుకు సంబంధించి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ పదవులు పొందిన వారిలో టీఎన్‌సీసీ మాజీ నేతలు, సీనియర్‌ నేతల వారసులు ఉన్నారు. 

టీఎన్‌సీసీ కోశాధికారిగా ఉన్న నాసే రామచంద్రన్‌ను తొలగించి ఆ పదవిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రూబీ మనోహరన్‌ను నియమించారు. టీఎన్‌సీసీ ఉపాధ్యక్షులుగా బలరామన్‌, గోపన్నా, నాసే రామచంద్రన్‌, ఏపీసీవీ షణ్ముగం, కీళనూరు రాజేంద్రన్‌, ఎస్‌ఎం ఇదయతుల్లా, వాలాజా కె.హసన్‌ సహా 32 మంది నియమితులయ్యారు.

ఇక ప్రధాన కార్యదర్శులుగా దివంగత మాజీ కాంగ్రెస్‌ ఎంపీ హెచ్‌.వసంత్‌కుమార్‌ తనయుడు, సినీనటుడు విజయ్‌ వసంత్‌కు అవకాశం కల్పించారు. అదేవిధంగా అరుళ్‌ అన్బరసు, చిరంజీవి, రంగభాష్యం, కార్తీ (తంగబాలు తనయుడు), తిరుగమన్‌ ఈవేరా (ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ తనయుడు) జెరోమ్‌ ఆరోగ్యరాజ్‌, కవింజర్‌ రామలింగం, జ్యోతి, లక్ష్మీ రామచంద్రన్‌, పొన్‌ చెల్లదురై, ఇళంజెళియన్‌ సహా 57మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

ఎన్నికల సమన్వయకమిటీ 

టీఎన్‌సీసీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ నియమితులయ్యారు. ఆ కమిటీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి, సీఎల్పీ నేత రామసామి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఎంపీ ఎస్‌.తిరునావుక్కరసర్‌, తంగబాలు, చెల్లకుమార్‌, మాణిక్కం ఠాకూర్‌, ఎంపీ జయకుమార్‌, విష్ణుప్రసాద్‌, మయూరా జయకుమార్‌, మోహన్‌కుమారమంగళం, కార్తీ చిదంబరం, జ్యోతిమణి, జేఎం ఆరాన్‌, రషీద్‌, పీటర్‌ ఆల్ఫోన్స్‌, శశికాంత్‌ సెంథిల్‌, సుదర్శన్‌ నాచియప్పన్‌, ఽధనుష్కోటి అదితన్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ

ఇక టీఎన్‌సీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా కేఎస్‌ అళగిరి, సీఎల్పీ నేత కేఆర్‌ రామసామి, మాణిక్కం ఠాకూర్‌, కుమరి అనంతన్‌, తిరునావుక్కరసర్‌, ఇళంగోవన్‌ సహా 56 మంది నియమితులయ్యారు.

అలాగే కాంగ్రెస్‌ ఎంపీ నాయకత్వంలో 35 మంది సభ్యులతో అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ, తంగబాలు నాయకత్వంలో 31మంది సభ్యులతో ప్రకటనల జారీ కమిటీ, పీటర్‌ ఆల్ఫోన్స్‌ నాయకత్వంలో 24 మంది సభ్యులతో ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీని కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది

click me!