కరోనాపై వివాదాస్పద వ్యాఖ్యలు: విపక్షాలకు నెటిజన్ల క్లాస్

By narsimha lodeFirst Published Jan 3, 2021, 2:00 PM IST
Highlights

కరోనాపై అనుమతించిన రెండు వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని డీసీజీఐ స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్లపై విపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

న్యూఢిల్లీ: కరోనాపై అనుమతించిన రెండు వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని డీసీజీఐ స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్లపై విపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ ను తాను తీసుకోనని ఆయన ప్రకటించారు. బీజేపీ వ్యాక్సిన్ ను ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై నెటిజన్లు అఖిలేష్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు.

also read:గుడ్‌న్యూస్: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి

దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నారు. కరోనా టీకా అనేది ఒక సున్నితమైన ప్రక్రియ. దీన్ని బీజేపీ ప్రభుత్వం దీనిని అలంకార లేదా ఆకర్షణీయమైన సంఘటనగా భావించకూడదన్నారు.
ప్రజల జీవితానికి సంబంధించిన విషయమన్నారు. టీకాలు వేయడానికి నిర్ణీత తేదీలను ప్రకటించాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ నేతగా చెప్పుకొంటున్న సల్మాన్ నిజామీ కూడ కరోనా వ్యాక్సిన్ ఓ ఫ్రాడ్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ తో సంబంధం కలిగి ఉన్నాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

click me!