మొన్న రాజీవ్.. నేడు ఇందిర, బీజేపీ పేర్ల మార్పు రాజకీయాలు: భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ

By Siva KodatiFirst Published Aug 10, 2021, 5:01 PM IST
Highlights

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిన క్యాంటీన్ల పేరు మార్చేందుకు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారంగా వున్న రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఇది దేశంలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరుతో ప్రవేశపెట్టిన క్యాంటీన్ల పేరు మార్చేందుకు ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథనాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ఆ క్యాంటీన్లకు ఇందిరా పేరు తొలగిస్తే సావర్కర్, దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ సైన్‌బోర్డులపై నలుపు రంగు పూస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇలాంటి పనులు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కాంగ్రెస్ సూచించింది.

ALso Read:రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు: ఇక నుండి మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న

మంగళవారం బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఇందిరా క్యాంటీన్ల పేరు మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సావర్కర్ బ్రిగేడ్, పండిత్ దీన్‌ దయాల్ ఉపాధ్యాయ్ బ్రిగేడ్ సైన్‌బోర్టులకు నలుపు రంగు పూస్తామని హరిప్రసాద్ హెచ్చరించారు. ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో సేవ చేసిన, పేదల కోసం అనునిత్యం శ్రమించిన ఇందిరా గాంధీ పేరు మార్పు సరికాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం పేర్లు మార్చే పని మానేసి ప్రజాసేవ చేస్తే మంచిది అని హరిప్రసాద్ సూచించారు. 

click me!