ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన శశిథరూర్

By narsimha lodeFirst Published Sep 30, 2022, 1:17 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్ శుక్రవారం  నాడు నామినేషన్ దాఖలు చేశారు. 

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి  శశిథరూర్ శుక్రవారం నాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మల్లికార్జున ఖర్గే సిద్దమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఖర్గే నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుండి దిగ్విజయ్ సింగ్ తప్పుకున్నారు.

తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మెన్ మధుసూధన్ మిస్త్రీకి నామినేషన్ పత్రాలు అందించారు. డప్పుచప్పుళ్లు, మద్దతు దారులు నినాదాలు చేస్తుండగా శశిథరూర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు ఎఐసీసీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. 

నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  తాను పోటీ నుండి తప్పుకోనని ప్రకటించారు. తాను పోటీ నుండి తప్పుకొంటే తనకు మద్దతుగా నిలిచిన క్యాడర్ ను నిరాశపర్చినట్టేనని  ఆయన చెప్పారు. ఖర్గే పార్టీకి భీష్మ పితామహుడే అని ఆయన అన్నారు. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గేకు దిగ్విజయ్ సింగ్ మద్దతు ప్రకటించారు.  ఇవాళ ఖర్గేతో భేటీ అయిన తర్వాత దిగ్విజయ్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీలో మల్లికార్జున ఖర్గే చాలా సీనియర్ నాయకుడని ఆయన గుర్తు చేశారు. ఖర్టే పోటీ చేస్తున్నందున ఆయనకే తాను మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన  స్పష్టం చేశారు. మరో వైపు రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ కూడా మల్లికార్జున ఖర్గేకు మద్దతు ప్రకటించారు.గెహ్లాట్ కూడా ఎఐసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టుగా మొదట్లో ప్రచారం సాగింది. రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  గెహ్లాటో ఎఐసీసీ చీఫ్ పదవి రేసు నుండి తప్పుకున్నారు. ఈ రేసులో తాను లేనని మాజీ సీఎం కమల్ నాథ్ తేల్చి చెప్పారు.

also read:ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: పోటీ నుండి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ పార్టీలో జీ 23 నేతల్లో ఒకరుగా శశిథరూర్ ఉన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని  కోరిన నేతల్లో  శశిథరూర్ తో పాటుఆజాద్ వంటి నేతలు కూడా ఉన్నారు. ఆజాద్ , కపిల్ సిబల్ వంటి నేతలు పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు.  అయితే శశిథరూర్ మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తున్నారు.

 


 

click me!