ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: పోటీ నుండి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్

By narsimha lodeFirst Published Sep 30, 2022, 11:52 AM IST
Highlights

ఎఐసీసీ అధ్యక్ష పదవి రేస్ నుండి దిగ్విజయ్ సింగ్ తప్పించుకున్నారు. మల్లికార్జున ఖర్గే  పేరును తాను ప్రతిపాదిస్తున్నట్టుగా దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. 

న్యూఢిల్లీ: ఎఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ నుండి తప్పుకొంటున్నట్టుగా మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.  మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేయడానికి ముందుకు రావడంతో తాను ఈ రేసు నుండి తప్పుకొంటున్నట్టుగా దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.నిన్న, ఇవాళ మల్లికార్జున ఖర్గేని కలిసినట్టుగా దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తాను పోటీ చేయనని ఖర్గేకు స్ఫష్టం చేసినట్టుగా తెలిపారు.. అయితే తాను పోటీలో ఉండడం లేదని ఖర్గే తనకు చెప్పారన్నారు. అయితే ఎఐసీసీ అధ్యక్షపదవికి ఖర్గే పోటీ చేస్తున్నారని మీడియాలో వచ్చిన సమాచారంతో తాను ఇవాళ ఖర్గేను కలిసినట్టుగా దిగ్విజయ్ తెలిపారు. ఖర్గే పోటీ చేస్తే తాను పోటీ నుండి తప్పుకొంటానని స్పష్టం చేశానన్నారు

పార్టీలో ఖర్గే చాలా సీనియర్ నాయకుడన్నారు. ఎఐసీసీ అధ్యక్ష పదవికి మల్లిఖార్జుఖర్గే పోటీ చేస్తున్నందున తాను ఆయనకు మద్దతిస్తున్నట్టుగా చెప్పారు.ఎఐసీసీ అధ్యక్ష పదవికి  పోటీ  నుండి తప్పుకొంటున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు. పార్టీకి తాను విధేయుడినని  దిగ్విజయ్ తెలిపారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి దిశా నిర్ధేశం చేయలేదని  ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ చెప్పారు. 

దిగ్విజయ్ పోటీ నుండి తప్పుకోవడంతో  శశి థరూర్ తో పాటు మల్లిఖార్జు ఖర్గేలు బరిలో నిలవనున్నారు.శశిథరూర్  ఇవాళ దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా ప్రకటించారు.  మల్లికార్జున ఖర్గే కూడా ఇవాళ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళే  చివరి రోజు. 

also read:ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికలు: రేసులో మల్లికార్జున ఖర్గే, తప్పుకోనున్న దిగ్విజయ్?

ఎఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది.రాజస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆశోక్ గెహ్లాట్ పోటీ నుండి తప్పుకున్నారు. రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గెహ్లాట్ సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పారు. ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నానని దిగ్విజయ్ చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులతో దిగ్విజయ్ చర్చించారు. దిగ్విజయ్ మద్దతుదారులు నిన్న న్యూడిల్లీకి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఇవాళ ఉదయానికి సీన్ మారింది. ఎఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తున్న నేపథ్యంలో రేస్ నుండి దిగ్విజయ్ తప్పుకున్నారు. 

click me!